Trolls On YS jagan With His Own YSRCP Slogans

కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయా శాఖల మంత్రులు ఒక్కో శాఖ మీద సమీక్షలు జరిపి వాటి తాలూకా వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నారు.

Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్‌, జగన్‌లని టచ్ చేయగలరా?

ఇందులో భాగంగా గత ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉన్న వైసీపీ, అధికారులను అడ్దుపెట్టుకుని వ్యవస్థలలో ఉన్న లొసుగులను వాడుకుంటూ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనేది ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నారు కూటమి నేతలు.

40 ఏళ్ళ రాజకీయ అనుభవం, పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న చంద్రబాబు కు సైతం అర్థంకాని రీతిలో, వ్యవస్థలను గాడిన పెట్టలేని స్థాయిలో సంస్కరణల పేరుతో వైసీపీ చేసిన విధ్వంసాన్ని శ్వేత పత్రాల రూపంలో బయటపెడుతోంది కూటమి ప్రభుత్వం.

Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..

రాజధాని అమరావతి మొదలుకుని, పోలవరం, విశాఖ భూదందా, మద్యం, ఇసుక, మైనింగ్, విద్యుత్, చివరికి దేవాలయాలలో భక్తులు వేసే హుండీ కానుకల వరకు ఎక్కడ చూసిన వైసీపీ అవినీతి అనకొండ మాదిరి కమ్మేసింది.

ప్రచార ఆర్భాటాలతో సొంత పత్రిక సాక్షికి, వైసీపీ కి భజన చేసే మరికొన్ని సాక్షి అనుబంధ మీడియాకు కోట్లలో ఆదాయం సమకూర్చిపెట్టారు జగన్. సలహాదారుల రూపంలో వేలకోట్ల ప్రజాధనాన్ని వృధా చేసారు. పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వ ఆదాయాన్ని వెచ్చించి ఐప్యాక్ టీమ్ లు, సోషల్ మీడియా ఛానెల్స్ కు జగన్ దోచిపెట్టింది కొన్ని కోట్లకు పైమాటే.

Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…

ప్రభుత్వ కార్యాలాయాలకు వైసీపీ పార్టీ రంగులు, ప్రజా క్షేత్రంలో నువ్వే మా నమ్మకం అంటూ అంటించిన జగన్ బొమ్మలు, వాలంటీర్ వ్యవస్థను సృష్టించి ప్రభుత్వ ఖజానాకు గుండు కొట్టిన తీరు వివరిస్తూ వైసీపీ చేసిన ఒక్కో అవినీతిని బయటకు తీస్తున్నారు. పథకాల రూపంలో పక్కదారి పట్టించిన సొమ్ము, ప్యాలస్ ల రూపంలో జగన్ పెత్తందారీ వ్యవస్థ అంతా బయట ప్రపంచం ముందుకొస్తుంది.

ఇలా కూటమి ప్రభుత్వం గత పాలకుల తప్పులను, అవినీతి చిట్టాను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు వివరిస్తుంటే వాటిని తెల్ల కాగితాలుగానో, చిత్తు పేపర్లుగానో పరిగణిస్తున్నారు వైసీపీ నేతలు, మాజీ మంత్రులు. గత ఐదేళ్లల్లో ఒక్క శాఖ మీద కూడా శ్వేత పత్రం విడుదల చెయ్యాలి అనే కనీస సృహ లేని నాయకత్వానికి శ్వేత పత్రాల విలువ ఇంతకన్నా ఎక్కువ ఏం తెలుస్తుంది.

శ్వేత పత్రం అంటే ఒక ప్రభుత్వం తాలూకా పాలనా విధానానికి చిహ్నం. శ్వేతపత్రం అంటే ఒక శాఖ మీద జరిగిన సమీక్ష, ఆ శాఖ తాలూకా పని తీరు, శ్వేతపత్రం అంటే ఒక ప్రభుత్వం తాలూకా నిజాయితీ, అలాగే ఒక ప్రభుత్వం తాలూకా అవినీతికి ఆధారం. వ్యవస్థల పని తీరుకి జవాబుదారీతనమే శ్వేతపత్రం. నీలిరంగు నిండిన వైసీపీ కళ్ళకు స్వచ్ఛమైన తెలుపును చూసే శక్తి ఉండకపోవచ్చు.




కానీ అది ప్రజలకు అవసరం. ప్రజా స్వామ్యానికి అత్యవసరం. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క చెప్పడమే శ్వేత పత్రం. తప్పు చేయనివాడికి దాని బలం తెలిస్తే, తప్పు చేసిన వాడికి దాని భయం తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలను చూసి వైసీపీ కంగారు పడుతుంది అంటే వైసీపీ బలపడుతున్నట్టా? భయపడుతున్నట్టా? సమాధానం చెప్పగలరా?