ఒక పక్క భారీ వర్షాలు, మరోపక్క పై నుండి వస్తున్న వరదలతో ఏ నిముషం ఎం జరుగుతుందో అని అల్లాడుతున్న విజయవాడకు బోట్ల రూపంలో మరో ప్రమాదం ప్రకాశం బ్యారేజ్ ముందుకొచ్చింది. మూడు ఒకే రకమైన బొట్లు అవి వైసీపీ పార్టీ రంగులు కలిగి మూడింటిని కలిపి ఒకటిగా చేసి వదిలారా అన్నట్టుగా అవి నేరుగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను తాకేలా వచ్చి ఆగాయి.
అయితే అప్పట్లో అవి కావాలని కుట్ర పూరితంగా చేసినవా.? లేక వరదలలో కొట్టుకొచ్చినవా.? అనే ఆలోచనలో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలు చేస్తూ కాలయాపన చెయ్యడానికి ఇది సమయం కాదు అని భావించిన కూటమి ప్రభుత్వం ముందు వరద బాధితుల సహాయక చర్యలు మీద ద్రుష్టి పెట్టింది.
అయితే ఇప్పుడు కాస్త వరదలు తగ్గుముఖం పడ్డటంతో అసలు ఈ బోట్లు బ్యారేజ్ కు వచ్చి గుద్దుకోవడం వెనుక జగన్ అన్నట్లుగా మాన్ మేడ్ తప్పిదమా లేక ప్రకృతి విపత్తా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పడింది. దీనితో దీని మీద విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాదాపు 11.5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ గుండా ప్రవహిస్తుంది.
ఈ సమయంలో నీటి ప్రవాహం చాల ఉదృతంగా కొనసాగుతుంది. అటువంటి సమయంలో బ్యారేజ్ గేట్లు ఎత్తి, వస్తున్న వరద ప్రవాహాన్ని కిందకి వదలాల్సి ఉంటుంది. కానీ దానికి ఆటంకం కలిగేలా వైసీపీ రంగులతో ఉన్న ఈ మూడు బొట్లు బ్యారేజ్ గేట్ల దగ్గరకు వచ్చి ఆగాయి. దీనితో బ్యారేజ్ గేట్లు దెబ్బతిని నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది.
అయితే ఇప్పటికి ఈ బొట్లు మావే, ప్రమాదవశాత్తు ఇక్కడికి కొట్టుకు వచ్చాయి అంటూ ఎవ్వరు ముందుకు రాకపోవడం కోసం మెరుపు. దీనితో ఈ బోట్ల వివాదం కు మరికాస్త బలం చేకూరింది. అలాగే మంత్రి కొల్లురవీంద్ర కూడా ఈ బొట్లు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులవిగా భావిస్తున్నట్లు అనుమానాలను వ్యక్తం చేసారు.
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ వివాదం పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీస్ అధికారులు. అయితే ఈ బోట్లు వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులవిగా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సురాయపాలెం కు చెందిన కోమటి రాంమోహన్ బోట్లుగా గుర్తించారు.
గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా నది పరివాహక ప్రాంతంలో ఈ బోట్లు తిరుగుతున్నట్లు అధికారులు స్పష్టం చేసారు. అయితే గతంలోను వైసీపీకి ఇటువంటి నేరపూరితమైన చరిత్ర ఉన్న నేపథ్యంలో అందరి ద్రుష్టి వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ మీదకు మళ్లింది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తన అధినేతను మెప్పించడానికి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రాజధాని అమరావతిలో పంట చేలు తగలబెట్టి రాజధానిలో అల్లర్లు సృష్టించదానికి యత్నించారు నందిగామ సురేష్. అలాగే తుని రైలు ఘటన వివాదంలో కూడా వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు అప్పట్లో ఎన్నో ఆరోపణలు బయటకు వచ్చాయి.
అలాగే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి మీదకు కర్రలతో దాడికి యత్నించారు జోగి రమేష్. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద కూడా వైసీపీ గుండాలను వెంటేసుకుని దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, వల్లభనేని వంశీ వంటి నేతలు దాడికి వెళ్లిన సంఘటనలు ఏపీ రాజకీయ చరిత్రలో చీకటి రోజులనే చెప్పాలి.
అప్పుడు “ప్రభుత్వ అండతో దాడికి వెళ్లిన నేతలందరూ ఇప్పుడు ప్రభుత్వ చర్యలతో దాక్కోకావడానికి” వెళుతున్నారు. అసలు వైసీపీ లోనే ఎందుకు ఇలాంటి నాయకులు ఉంటారు అనేది రాజకీయ మేధావులను, ప్రజాస్వామ్యవాదులు వెండాడుతున్న ప్రశ్న.
ఒకవేళ ఆ బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కు అనుకోని ప్రమాదం ఏదైనా ఏర్పడి ఉంటే ఆ ప్రమాదం తాలూకా నష్టం కనీసం ఊహకు కూడా అందదు అనేది వైసీపీ కి తెలియదా.? లేక తెలిసే చేస్తున్నారా.? తాము ప్రతిపక్షములో ఉంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రాష్ట్ర భవిష్యత్ ను సైతం బలి చేస్తారా.?
అలాగే తన పార్టీ ని గెలిపించలేదనే అక్కసుతో ఎంతమంది ప్రజలనైనా బలిపీఠం ఎక్కించడానికి వైసీపీ వెనుకాడదా.? వైసీపీ రాజకీయాలు రాష్ట్ర విధ్వంసాన్ని, ప్రజలు వినాశనాన్ని కోరుకుంటున్నాయి అని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరిస్తోంది. వైసీపీ రాజకీయాలకు ఏపీ భారీ మూల్యం చెల్లించక తప్పదా.?






