బీసీల పేరుతో వైసీపీ రాజకీయాలు.. బ్యాక్ ఫైర్ అవుతుందేమో?

YCP leaders raise BC welfare debate

రాజకీయ పార్టీలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆలోచనలు, వ్యూహాలు అవసరమే. కానీ వాటిలో కూడా చిత్తశుద్ధి ఉన్నప్పుడే అవి సత్ఫలితాలు ఇస్తాయి. బిగ్ బాస్ రియాల్టీషోలో ప్రేక్షకులను వినోదింపజేసేందుకు రోజుకో కొత్త టాస్క్ ఇస్తుంటారు.

వైసీపీ బిగ్ బాస్ కూడా తన పార్టీ నేతలకు ఒక్కో వారం లేదా నెల లేదా రెండు మూడు నెలలకో టాస్క్ ఇస్తుంటారు. ఉదాహరణకి నిన్న మొన్నటి వరకు ‘డీఎస్సీలో అవకతవకలు, సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేష్‌ రాజీనామా టాస్క్’ ఇవ్వగా వైసీపీ నేతలు వాటితో చాలా చక్కగా షో రక్తి కట్టించారు.

ADVERTISEMENT

ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయిపోయిందని అనుకున్నారో లేక స్థానిక సంస్థల ఎన్నికలకు షిఫ్ట్ అవ్వాలి కనుక డీఎస్సీని వదిలేశారో తెలీదు. కానీ ఇప్పుడు తాజా టాస్క్ బీసీల సంక్షేమం.

చాలా కాలం తర్వాత మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ నేడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, ఈ టాస్క్‌పై వాదనలు మొదలుపెట్టారు. జగన్‌ హయంలో బీసీలకు పెద్ద పీట వేశారని, కానీ చంద్రబాబు నాయుడు హయంలో బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు.

తమ హయంలో బీసీలలో ఎవరెవరికి ఏయే పదవులు ఇచ్చామో చెప్తానని, మీ పాలనలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. దీనిపై సిఎం చంద్రబాబు నాయుడుతో సహా ఎవరితోనైనా తాను చర్చకు సిద్దంగా ఉన్నానని, నా సవాల్ స్వీకరించగలరా? టైమ్‌, డేట్, ప్లేస్ మీరే నిర్ణయించుకొని చెప్తే, నేను రెడీ,” అని అనిల్ కుమార్‌ సవాలు విసిరారు.

నిజమే జగన్‌ హయంలో పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చారు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి, క్రీస్టియన్ మతస్తులకు మాత్రమే ప్రాధాన్యం ఉండేదని, మిగిలినవారందరూ డమ్మీలుగానే ఉండేవాళ్ళని, వైసీపీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారు బహిరంగంగానే చెప్పారు కదా?

అయినా వైసీపీలో నం.2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డినే కోటరీ అడ్డుకున్నప్పుడు,ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్యాలస్‌లో ప్రవేశం ఎలా లభిస్తుంది?నాడు వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చి బస్సుయాత్ర కూడా చేయించడం తప్పని భావించలేదు కదా?

కనుక కేవలం పదవులు ఇచ్చినంత మాత్రాన్న ఏ వర్గానికి న్యాయం చేసినట్లు కాదు. వారికి సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇచ్చినప్పుడే వారికి న్యాయం చేసినట్లవుతుంది.

అదే.. టీడీపి, జనసేన రెండు పార్టీలలో కూడా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలా గౌరవ మర్యాదలు, ప్రాధాన్యం లభిస్తున్నాయి కదా?

ఇంతకాలం కాపుల పేరుతో రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వైసీపీ, ఇప్పుడు బీసీ సంక్షేమం అంటూ కొత్త పల్లవి దేనికంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే.. కాదనగలదా?

ADVERTISEMENT
Latest Stories