ప్రజల మధ్యన చంద్రబాబు, మంత్రులు.. భ్రమలో జగన్‌!

Chandrababu Naidu vs Jagan Mohan Reddy: People Connect Matters

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో కొన్ని అభివృద్ధి పనులు జరిపించారు. కానీ ఆయన కుప్పం.. ప్రజల మీద ప్రేమతో ఆ పని చేసి ఉండి ఉంటే ప్రజలు ఆయనకు నీరాజనాలు పట్టేవారు. కానీ చంద్రబాబు నాయుడుని ఆయన సొంత నియోజకవర్గంలోనే రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో అరకొర అభివృద్ధి పనులు జరిపించినందున ప్రజలు పట్టించుకోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడునే భారీ మెజార్టీతో గెలిపించారు.

సమైక్య రాష్ట్ర మాజీ సిఎం కిరణ్ కుమార్‌ రెడ్డి ఇటీవల ఓ సభలో తన స్వీయ అనుభవాన్ని వివరిస్తూ, “కేవలం అభివృద్ధి పనులు చేసినంత మాత్రాన్న ప్రజలు ఓట్లు వేసి గెలిపించరు. అక్కడి ప్రజలతో నేతలు సత్సంబంధాలు ఏర్పరచుకొని వారితో మమేకమవ్వాలి. ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. అప్పుడే మనకి ఓట్లు వేస్తారు. లేకుంటే లేదు,” అని అన్నారు.

ADVERTISEMENT

ఇంత చిన్న విషయాన్ని జగన్‌ పట్టించుకోలేదు కనుకనే కుప్పం ప్రజలు ఆయనను కాదని చంద్రబాబు నాయుడువైపే మొగ్గారు.

అయితే పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో… వాటి ప్రభావం ఏవిధంగా ఉంటుందో జగన్‌కు బాగా తెలుసు. ఇదివరకు ఓదార్పుయాత్రలు, పాదయాత్రలు చేసి ప్రజలకు చేరువయ్యారు. కనుకనే ప్రజలు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక పరదాల మాటున ఉండిపోయారు. అధికారం కోల్పోయిన తర్వాత గృహనిర్బంధం విధించుకున్నట్లు ప్యాలస్‌లో ఉండిపోతున్నారు. ఎందువల్లనంటే, నా పేరు, నా ఫోటో, నా నోటి మాట చాలు.. ప్రజలు కళ్ళు మూసుకొని మా పార్టీకి ఓట్లు గుద్దేస్తారనే భ్రమలో ఉన్నందునే అనుకోవాల్సి ఉంటుంది.

ప్రజలు మనవైపే ఉన్నారనే భ్రమలో జగన్‌ ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తుంటే, చంద్రబాబు నాయుడు, మంత్రులు నిత్యం ప్రజల మద్యనే ఉంటూ వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కనుక వచ్చే ఎన్నికలలో ఏదో అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప, ప్రజలు ఎవరివైపు ఉంటారో తేలికగానే ఊహించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories