
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి లండన్ వెళ్ళిపోయేందుకు బ్యాగ్ సర్దుకొని సిద్దంగా ఉన్నారు. కనుక ఏపీలో ముంపు ప్రాంతాలలో పర్యటించే అంత సమయం లేదు. కనీసం వర్షాలు, వరదల గురించి ఆలోచించే సమయం కూడా లేదు.
కానీ తాను దైవస్వరూపుడినని జగన్ గట్టిగా నమ్ముతున్నారు పులివెందుల ప్యాలస్‌లో ‘ప్రజాదర్భార్’ నిర్వహించి, భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ భక్తులలో వైసీపి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు కూడా ఉన్నారట!
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
ఎప్పటిలాగే వారందరికీ జగన్ ధైర్యం చెపుతూ, “అందరికీ మనం మంచే చేశాము. ప్రతీ ఇంట్లో మనం చేసిన మంచి ఉంది. అందుకే ప్రజలకు మనపైనే నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఈ కష్టాలు, సమస్యలు శాశ్వితం కావు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి.
మనమే అధికారంలోకి వస్తాము. అంతవరకు అందరూ ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉండాలి. వైసీపి నేతలు, కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుంది,” అని ఇంకా పూర్తిగా అరిగిపోని కొత్త రికార్డు వేశారు.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
అయితే వారు జగన్‌కు తమ సమస్యలు మొరపెట్టుకునేందుకు వచ్చారా లేక ఓటమితో క్రుంగిపోయి ప్రజల మద్యకు రాలేక ప్యాలస్‌లో ఉండిపోతున్న ఆయనకి ధైర్యం చెప్పేందుకు వచ్చారా?అనే సందేహం కలుగుతుంది.
ప్రజలకు మంచి చేశామని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ప్రజలు అలా అనుకోలేదు. అందుకే 175 అనుకుంటే 11 మాత్రమే ఇచ్చారు. ఎందుకని జగన్ ప్రశ్నించుకుంటే సమాధానం ఆయనకే లభించేది.
కానీ తన తప్పులని గుర్తించకుండా, సరిదిద్దుకోకుండా, ప్రజలు మనవైపే ఉన్నారు. మళ్ళీ మనమే అంటే… నేనే అధికారంలోకి వస్తాననే గుడ్డి భ్రమలో ఉంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
కనీసం ప్రతిపక్ష నాయకుడుగా కూడా నిరూపించుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రజలు మళ్ళీ ఓట్లు వేస్తారా? అసలు మున్ముందు తన పరిస్థితి ఏమిటి? ఏవిదంగా ఉండబోతోంది?అని జగన్ ఆలోచిస్తున్నారో లేదో తెలీదు కానీ ప్రజలకు మాత్రం ఆయన ఫ్యూచర్ స్పష్టంగా తెలుసు.