సాయానికి ‘చెయ్యి’ రాదు…బురద జల్లడానికి ‘నోరు’ వస్తుందా.?

YS Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.? ఉంటే వరద ప్రభావిత ప్రాంతాలలో ఇంకా ఆకలి కేకలు ఎందుకు వినిపిస్తున్నట్టు.? అంటూ తన X లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.

వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

ADVERTISEMENT

* వరద ప్రాంతాలలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు ‘కళ్ళ’ ముందు కనపడుతున్నాయి. కానీ విపక్షమైన వైసీపీ చేస్తున్న సాయం కనీసం ‘సాక్షి’ మీడియాలో కూడా కనిపించడం లేదు ‘వై’..?

* జల విలయంతో కకావికలమైన విజయవాడ నగర పునర్నిర్మాణానికి, బాధిత కుటుంబాలకు అండగా ఉండడానికి ప్రభుత్వ సాయంతో పాటుగా దాతల విరాళాలు వరదలా వస్తున్నాయి. అయితే అవి ప్రకటన రూపంలో కాకుండా చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు, సాయం రూపంలో బాధితులకు చేరుతున్నాయి. కానీ వైసీపీ ప్రకటించిన ‘కోటి’ రూపాయల విరాళం ఇప్పటికి ప్రకటన రూపంలోనే ఎందుకు ఆగిపోయింది..?

* 11 సీట్లతో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది అంటున్న కూటమి నేతలకు మాకు 40 పర్శంట్ ఓట్ల శాతం ఉంది, గెలిచిన సీట్లు కాదు వచ్చిన ఓట్ల శాతం చూడండి అంటూ తమకు ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్లి వాదించే వైసీపీ ఇప్పుడు తమ పార్టీకి ఉన్న 40% ప్రజలు బాగుకోసం ఎం చేస్తుందో చెప్పగలదా.?

* అన్ని అనుకున్నట్టుగా కోర్ట్ అనుమతులు దక్కి, పాస్ పోర్ట్ చేతికి వచ్చినట్లయితే ఈ సమయానికి వైసీపీ అధినేత జగన్ లండన్ వీధులలో చక్కర్లు కొడుతూ ఉండేవారు కాదా.? కనీసం విదేశాలకు వెళ్లే వరకైనా విజయవాడ ప్రజలకు అండగా ఉంటూ తన వంతు సాయం కింద ఒక లీటర్ వాటర్ బాటిల్ అయినా జగన్ బాధితులకు అందించారా.?

* ఒక్క రెండు రోజులు బాబు, పవన్, లోకేష్ మీడియాలో కనిపించకపోతేనే, వీళ్ళు అధికారమిచ్చిన ప్రజలను గాలికొదిలి విహార యాత్రలు చేస్తున్నారు అంటూ అసత్య ప్రచారాలు చేసే వైసీపీ ఇప్పుడు 40%ఓటు బ్యాంకు ఇచ్చిన ప్రజలను వరదలకు వదిలేసి విదేశాలకు వెళ్లడం న్యాయమేనా.?

* ఒక్క చంద్రబాబు ఇంటిని టార్గెట్ చెయ్యడానికి ఏకంగా బాబు మాన్ మైడ్ ఫ్లడ్స్ సృష్టించారు అంటూ బాధ్యతారాహిత్యమైన విమర్శలు చెయ్యడం ఒక మాజీ ముఖ్యమంత్రికి సబబేనా.? దీని వల్ల జగన్ కు ఒరిగిందేమిటి.? బాబుకి పోయిందేమిటి.?

* 45 ఎళ్ళ తన రాజకీయ జీవితంలో ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎన్నో ఎదుర్కున్న బాబు వాటి పరిష్కరానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ తన పార్టీ తరుపున, కూటమి ప్రభుత్వం తరుపున అందుబాటులో ఉన్న అందరి ఎమ్మెల్యే లను, మంత్రులను, ఎంపీ లను వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించి అధికార యంత్రాగం మొత్తాన్ని తానే ఒక సైన్యంలా ముందుండి నడిపిస్తున్నాడు.

* కానీ జగన్ తన పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే లను కానీ, మాజీ మంత్రులను కానీ ఏ ఒక్కరిని వరద ప్రాంతాలలో సహాయక చర్యలకు తోడ్పడాలి అంటూ ఆదేశించలేదు వై.? అంటే అధికారం ఉంటేనే వైసీపీకి ప్రజల పట్ల బాధ్యత ఉంటుందా.? రాజకీయాలకు వచ్చింది పదవుల కోసం కాదు సేవ చెయ్యడానికే అంటున్న వైసీపీ కి అధికారంతో పనేంటి.?

* తన హయాంలో కేవలం బటన్ నొక్కడానికే పరిమితమైన జగన్ కనీసం గుంతలు పడ్డ రోడ్లను కానీ, వాగులలో, నదులలో పేరుకుపోయిన పూడికలు తీయడానికి కానీ నిధులు మంజూరు చెయ్యలేదు. వాటి ఫలితమే ఈనాటి బుడమేరు ముంపు అన్నది వాస్తవం కాదా.?

* తన అహం చల్లార్చుకోవడానికి రాష్ట్ర రాజధాని అమరావతి ని ముంపు ప్రాంతం అంటూ ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న జగన్ అండ్ కో చేస్తున్నది మాన్ మెయిడ్ విధ్వంసం కాదా.?

* సాయం అంటూ ప్రకటించిన విరాళం అందించడానికి ‘చేతులు’ రాని జగన్ కు కూటమి ప్రభుత్వం పై బురద రాజకీయ చేయడానికి మాత్రం ‘నోరు’ వస్తుంది. దీన్ని రాజకీయమంటారా.? రాక్షసానందమంటారా.? వైసీపీ కి కావాల్సింది ప్రజలకు ప్రభుత్వ సాయమా.? లేక రాష్ట్ర విధ్వంసమా.?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి, బాధితులకు అండగా నిలబడి, ప్రభుత్వం చేయలేని పనిని విపక్షంగా మేము చేసి చూపించాం అని నిరూపించుకుని ప్రభుతం పై విమర్శలు చేస్తే అది విలువలతో కూడిన రాజకీయమవుతుంది. అలాకాకుండా మేము అధికారపక్షమైతే ఏరియల్ సర్వేలతో సరిపెడతాం..,విపక్షమైతే విమర్శలతో కాలయాపన చేస్తాం తప్ప ప్రజలకు చేసేదేమి లేదు అంటూ జగన్ ముందుకెళితే ఇక వైసీపీ భవిష్యత్ కు చరమ గీతం పాడినట్టే.

ADVERTISEMENT
Latest Stories