‘లా అండ్ ఆర్డర్’ అంటే ‘గొడ్డలి వేటు’లా..?

ys-avinash-reddy

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడే ఆవు నెయ్యి కల్తీ వ్యవహారం సుప్రీం కోర్ట్ ముంగిట చేరడంతో ప్రభుత్వానికి న్యాయస్థానం కొన్ని ప్రశ్నలను సంధించింది. వాటికి తగిన సాక్ష్యాలు చూపించాలంటు కోర్ట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇక వైసీపీ నేతల నోటికి పని కల్పించినట్లయ్యింది.

ADVERTISEMENT

చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ లడ్డు కల్తీ వ్యవహారం తెర మీదకు తీసుకువచ్చారని, మతాన్ని అడ్డుపెట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసారని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హిందువులకు, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ తీర్పు తమకు అనుకూలంగా వచ్చినట్లు తెగ రెచ్చిపోతుంది.

ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం లడ్డు వివాదాన్ని తీసుకువచ్చిందని, కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ ఈఓ ప్రకటించినప్పటికీ ఈ వివాదాన్ని ప్రభుత్వ పెద్దలు మరికాస్త విస్తరించారని, ఇప్పటికైనా సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలతో ప్రభుత్వం కళ్ళు తెరవాలంటూ, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలి అంటూ హెచ్చరించారు.

అయితే అసలు చట్టాలు, కోర్టులు అంటూ అవినాష్ చాల పెద్దపెద్ద పదాలే వాడుతున్నారు కానీ ఆయన గత ఐదేళ్ల నుంచి వివేకా గొడ్డలి వేటు కేసులో కోర్టులను తప్పించుకుని తిరుగుతున్నారు అనే విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారు. అలాగే తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ గత పదేళ్ల నుండి తన అక్రమాస్తుల కేసుల విచారణకు హాజరు కాకుండా కుంటి సాకులు చెప్పుకుంటూ బెయిలు మీద బయట తిరుగుతున్న సంగతి గుర్తుకు రాలేదా.?

వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేకా కేసు విషయంలో సిబిఐ అధికారులు తనను అరెస్టు చేయడానికి వస్తే వారిని తన అధికారంతో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరువరించిన సంగతి అవినాష్ మరిచారా.? అప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగానే పనిచేసిందా.? గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల నుండి ఎన్ని తీర్పులు వెలువడ్డాయో లెక్క చెప్పగలరా.?

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి తరలింపు వరకు ఏ ఒక్క కేసులో కూడా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా న్యాయస్థానాలు తీర్పుని వెలువడించలేదు. అయినా కూడా వైసీపీ తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా మొండిగా ముందుకెళ్లి బొక్కబోర్లా పడింది.

కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం లడ్డు వివాదం విషయంలో సుప్రీంకోర్ట్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాం అనేలా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తుకు ప్రభుత్వం వేసిన సిట్ ను కూడా వెనక్కి తీసుకుని న్యాయస్థానాల పట్ల తమకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని తెలియచేసింది. అలాగే న్యాయమూర్తి అడిగిన సాక్షాలను న్యాయస్థానం ముందు ఉంచడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది.

దోషులుగా ఆరోపణలు ఎదుర్కొంటు, చట్టాల కళ్ళు కప్పి తిరుగుతున్న వైసీపీ నాయకులు సైతం కోర్ట్ తీర్పులను చూసి కళ్ళు తెరవండి అంటూ ఉచిత సలహాలిస్తుండడం కాస్త విస్మయానికి గురి చేస్తుంది, ‘లా అండ్ ఆర్డర్’ అంటే గొడ్డలి వేటులా.? కోడి కత్తి కేసులా.? అంటూ అవినాష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కూటమి శ్రేణులు.

ADVERTISEMENT
Latest Stories