వివేకా హత్య కేసు విచారణ… ఇప్పట్లో ముగిసేది కాదు!

YS-Avinash-Reddy YS Vivekananda Reddy CBIవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును శుక్రవారం హైదరాబాద్‌లో సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడి చంచల్‌గూడ జైలులో ఉన్న గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ శంకర్ రెడ్డి, దేవిరేడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసులో ఏ-8 నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో 145 పేజీలతో సీబీఐ మూడో ఛార్జ్ షీట్‌ వేసింది. ఈ కేసు తదుపరి విచారణని ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించడంతో నిందితులు చంచల్‌గూడ జైలుకి, అవినాష్ రెడ్డి కడపకు తిరుగు ప్రయాణం అయ్యారు.

ADVERTISEMENT

ఈ కేసు విచారణ ఏపీలో చురుకుగా, పారదర్శకంగా సాగడంలేదనే కారణంతోనే సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి హైదరాబాద్‌కు మార్పించుకొన్నారు. అయితే తెలంగాణకు మారిన ఈ కేసు విచారణ వేగవంతం కాలేదు. ఈ కేసు విచారణను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించినప్పటికీ, నిందితులు చట్టపరమైన అవకాశాలను, లొసుగులను తెలివిగా ఉపయోగించుకొంటూ సుప్రీంకోర్టు చేతనే ఈ కేసు విచారణను వాయిదా వేయించుకొంటున్నారు.

తెలంగాణ సీబీఐ కోర్టులో నేడు 1వ తేదీ నుంచి 22కి తదుపరి విచారణ వాయిదా పడింది. అంటే దాదాపు నెలరోజులు కేసు పొడిగించబడిందన్న మాట. ఈ లెక్కన చూస్తే ఈ కేసు ఈ ఏడాదిలో పూర్తికాదని స్పష్టమవుతోంది. కనుక మరో ఏడాదో లేదా పదేళ్ళో సాగినా ఆశ్చర్యం లేదు.

మరోవిదంగా చెప్పుకోవాలంటే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయనే దానిని బట్టి ఈ కేసు విచారణ సాగుతుంది తప్ప కోర్టులను బట్టి కాదనే భావించవచ్చు.

ఓ హత్య కేసు విచారణను రాజకీయశక్తులు ఇంతగా ప్రభావితం చేస్తుండటం శోచనీయమే. రాజకీయ ఒత్తిళ్ళతో సీబీఐని కదలకుండా నిలబెట్టేస్తున్న నిందితులు, వారికి అండగా నిలుస్తున్న వైసీపీ ప్రభుత్వమే సీబీఐ విచారణను వేలెత్తిచూపుతూ విమర్శిస్తుండటం మరో విచిత్రం.

ADVERTISEMENT
Latest Stories