అవమానించిన వాడే ఆదర్శమయ్యాడా.?

Red Book Started Implementation

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయకముందు వరకు వైసీపీ నేతలు నారా లోకేష్ ను పప్పు…పప్పు అంటూ ఎంతో హేళన గా మాట్లాడే వారు. అలాగే వైసీపీ ఆస్థాన దర్శకుడైన రాంగోపాల్ వర్మ కూడా తానూ వైసీపీకి మద్దతుగా టీడీపీ, జనసేనలకు కౌంటర్ గా తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం,శపధం సినిమాలలో కూడా నారా లోకేష్ క్యారెక్టర్ ను ఒక పప్పుగా చూపించే ప్రయత్నం చేసారు.

ADVERTISEMENT

రాజకీయ విశ్లేషకుల ముసుగులో ఉండే కొందరు వైసీపీ సానుభూతి పరులు కూడా లోకేష్ విషయంలో వైసీపీ నేతల విమర్శలకు బలం చేకూరేలా వ్యాఖ్యలు చేస్తూ అటు టీడీపీ పార్టీ శ్రేణులను ఇటు లోకేష్ ను మానసికంగా కుంగతీయడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసారు.

లోకేష్ రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు, అలాగే తమ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్లు ఇచ్చేటప్పుడు తెలుగులో భాషలో మాట్లాడడానికి కాస్త తడబడిన మాట ముమ్మాటికీ వాస్తవమే. అయినంత మాత్రానా అతని పై బాడీ షేమింగ్ కామెంట్లు, పప్పు అంటూ హేళన చేయడం ఎంతవరకు సమంజసం. ఇలా వైసీపీ నేతలు లోకేష్ ను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించేసింది.

అయితే తన పై వచ్చిన విమర్శలకు తడబడకుండా, తలవంచకుండా పట్టుదలగా తన ఆహార్యం మీద అలాగే తన మాతృ భాషా మీద పూర్తి పట్టు సాధించి తనను అవమానించిన వైసీపీ నేతలకు, తనను ఇబ్బంది పెట్టాలని అని చూసిన వైసీపీ అనుకూల మీడియాకు తన సత్తా ఏమిటో చూప్పించారు లోకేష్.

వైసీపీ ప్రభుత్వం తన తండ్రి మీద అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన వైనం మీద లోకేష్ చేసిన పోరాటం ఆయనలోని తెగువను పార్టీ శ్రేణులతో పాటుగా ప్రత్యర్థులకు చూపించారు. జాతీయ మీడియాలో సైతం తన గళం బలంగా వినిపించగలుగారు అలాగే ఢిల్లీ వేదికగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు సవాళ్లు కూడా విసిరారు.

అలాగే ప్రతిపక్షంలో ఉన్న తన టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీ క్యాడర్ తో పాటు సాధరణ ప్రజలకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో అటు ప్రజలు నుంచి ఇటు పార్టీ శ్రేణుల నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలుసుకున్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉల్లంఘించి ఈ సమస్యలను సృష్టించిన వారికీ చట్టపరంగా శిక్షలు పడేలా చేస్తా అంటూ హామీ ఇచ్చి ఆ అరాచకాలన్నీ నోట్ చేసుకుంటూ దానికి ‘రెడ్ బుక్’ అంటూ నామకరణం చేసారు లోకేష్. అయితే అప్పుడు లోకేష్ తో పాటుగా ఈ రెడ్ బుక్ మీద కూడా విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు అదే రెడ్ బుక్ ను చూసి ఎందుకు భయపడుతుందో.? ఎందుకు వాటిని ఆదర్శంగా తీసుకుందో చెప్పగలదా.?

అయితే ఇప్పుడు లోకేష్ రాసిన ఈ రెడ్ బుక్ భయంతో వైసీపీ కూడా పుస్తకాలు, డైరీలు రాయడం మొదలుపెట్టింది. దీనికి వైసీపీ మాజీ మంత్రి నుండి వైసీపీ అధినేత వరకు లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని పోటీ పడి మరి పుస్తకాలు రాస్తున్నారు. అంబటి వంటి వారు ‘గ్రీన్ బుక్’ అంటుంటే, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ‘గుడ్ బుక్’ అంటూ పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు.

అయితే అప్పుడు అవమానించిన వారే ఇప్పుడు లోకేష్ ను ఆదర్శంగా తీసుకున్నారా.? అంటూ వైసీపీ నేతల మీద ఆ పార్టీ అధినేత మీద ఇటు లోకేష్ తో పాటు అటు టీడీపీ శ్రేణులు కూడా కౌంటర్లు వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories