YS Jagan

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన నాలుగు రోజులుగా ఎదో ఒక రియాలిటీ గేమ్ షో కి వచ్చి వెళ్లినట్లు రోజుకో గంట వరద బాధిత ప్రాంతాల ప్రజలను నవ్వుతు పరామర్శించి, వారి చేతికి సాయం అందించకుండా, నెత్తిన చెయ్యి పెట్టి ప్రభుత్వం పై రెచ్చకట్టే వ్యాఖ్యలు చేసి మెల్లిగా తన తాడేపల్లి పాలస్ కు జారుకుంటున్నారు.

అయితే ఈ రెండు రోజులు మీడియా ముందు జగన్ చేసిన హడావుడి అంతా ఆయనగారి లండన్ పర్యటనకు రిహార్సల్స్ మాత్రమే అనేది కూటమి నేతల అభిప్రాయం. ఎలాగూ ఎటు రెండు రోజుల తరువాత విదేశాలకు వెళ్ళిపోతాను కాబట్టి వెళ్లేముందు ప్రజలలో తన మీద వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికి జగన్ ఈ వరద ప్రాంతాల పర్యటనకు టీం ను సిద్ధం చేసుకుని యాత్ర చేసి వచ్చారు అనేది కూటమి నేతల వాదన.

Also Read – భారత్‌ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు

అయితే ఇప్పుడు ఈ వాదనకు బలం చేకూరేలా జగన్ విదేశీ పర్యటన అంశం చర్చకొచ్చింది. ప్రజలు మీదే తనకు తన పార్టీకే కొండంత ప్రేమ ఉందని, ఆయన తప్పితే ఇటువంటి విపత్తును ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు అనేలా వైసీపీ ఇచ్చిన కవరింగ్ జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం అంత కూడా లండన్ ఫ్లయిట్ ఎక్కడానికే అనేది స్పష్టమయింది.

జగన్ లండన్ ఫ్లయిట్ ఎక్కాలంటే అంతకన్నా ముందు కోర్ట్ మెట్లెక్కాలి. జగన్ దేశ సరిహద్దు దాటాలంటే న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో తన లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ జగన్ ముందు కోర్ట్ మెట్లెక్కారు.

Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత

జగన్ డిప్లొమాట్ పాస్ పోర్ట్ రద్దు కావడంతో దాన్ని ఐదేళ్ల పాటు రెన్యూవల్ చేయాలనీ పాస్ పోర్ట్ ఆఫీస్ ను సిబిఐ కోర్ట్ ఆదేశించింది. అయితే ఈ కేసు విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో ఉండడంతో జగన్ ఎన్వోసి కోసం అప్లై చేసుకోగా అందుకు న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది.

దీనితో జగన్ దీని పై హైకోర్టు ను ఆశ్రయించారు. తన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతిచ్చిందని జగన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు ఈ అంశంలో తుది విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది. దీనితో జగన్ లండన్ పర్యటన మరోసారి వాయిదా పడింది.

Also Read – నేను భారతీయురాలినే అంటున్న ప్రభాస్ హీరోయిన్.