పరువు – ప్రతిష్ట… ఈ మాటలు నీకేల జగన్..!

అయిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రపుటల్లో చిరస్థాయిగా తన పేరును నిలుపుకున్న జగన్ మోహన్ రెడ్డి గారికి ”పరువు – ప్రతిష్ట” అంటూ పెద్ద పెద్ద పదాలు పలకడం ఓ విధంగా ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తిరుమల లడ్డు విషయంలో వచ్చిన నివేదికలు, బయట పడుతున్న ప్రతి సమాచారంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న జగన్ డిఫెన్స్ లో పడిపోయి… దీనిని రాష్ట్ర పరువుతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ సమాచారం బయటకు రావడం వలన తిరుమల “ప్రతిష్ట” దెబ్బ తినడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ “పరువు” కూడా పోతుందనే విధంగా జగన్ చేసిన వ్యాఖ్యలలోని ఆంతర్యం అవగతం చేసుకోవచ్చు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాము ఎంతటి దుశ్చర్యలకైనా పాల్పడతాము గానీ, దానిని బయటపెడితే మాత్రం రాష్ట్ర పరువుతో ముడిపెట్టి, అసలు విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్యే కదా!

అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్రానికి ఎంతటి కీర్తి ప్రతిష్టతలను తెచ్చిపెట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టి, దేశంలోనే గంజాయికి ఏపీని కేరాఫ్ అడ్రస్ గా మార్చిన ఘనకీర్తి జగన్ వర్యులదే కదా!

అధికారంలో ఉన్నప్పుడే కాదు, 2014-19లలో రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, అలాగే రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకులు రుణాలు మంజూరు చేయకుండా చేసిన ప్రయత్నాలలో “పరువు” వాటా ఏపాటిదో?

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి “ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు శ్రేయస్కరం కాదని” సోషల్ మీడియా వేదికలుగా తమ పార్టీ వారి చేత పెట్టుబడిదారులకు చేయిస్తున్న ట్వీట్లలోని ఎంతటి “పరువు – ప్రతిష్ట” దాగి ఉందో?

అలాగే రాజధానిగా అమరావతి విషయంలో ‘చిలువలు – పలువలు’గా జగన్ చేసిన వ్యాఖ్యలు అంధప్రదేశ్ కు ఎంతటి ఘనకీర్తిని తెచ్చిపెట్టిందో కూడా వివరిస్తే సముచితంగా ఉండేది కదా!?

అయినా తెచ్చిపెట్టుకున్న స్క్రిప్ట్ నే సరిగా చదవలేని పరిస్థితిలో ఉన్న జగన్ కు, “పరువు – ప్రతిష్ట” వంటి బరువైన పదాలను ఎవరు లిఖించారో? అంతేలే… సంబంధం లేని పదాలను ఉచ్చరించడం జగన్ వర్యులకు పరిపాటే కదా!

ADVERTISEMENT
Latest Stories