YS Jagan Mohan Reddy YSR Congress Party 2025 Horoscope

మార్చి 30 న తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ సందర్భంగా సర్వత్రా పంచాంగ శ్రవణం వినిపిస్తుంది. సామాన్య ప్రజానీకంతో పాటుగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా వారి వారి కార్యాలయాలలో ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.

అయితే ఇందులో భాగంగా ఒక్కో పార్టీ ఒక్కో సిద్ధాంతితో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించి ఈ ఏడూ ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ పార్టీ అధినేత పరిస్థితి ఎలా ఉండబోతుంది వంటి వాటిని వివరిస్తారు. అయితే వాటిలో ఆ నాయకుడి నక్షత్రాన్ని, రాశిని ఈ బట్టి ఈ ఏడూ వారికి దక్కే రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేది వీక్షకులకు తెలియచేస్తారు.

Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!

వైసీపీ అధినేత వైస్ జగన్ జాతక చక్రం ప్రకారం ఈ ఏడాది జగన్ కు రాజపూజ్యం 11, అవమానం 164 అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికలలో వైసీపీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలకు ప్రతీకగా 11 దానిని జగన్ కు దక్కిన రాజపూజ్యంగా వర్ణిస్తున్నారు.

అలాగే వైసీపీ ఓడిన 164 స్థానాలను జగన్ కు జరిగిన అవమానంగా అభివర్ణిస్తూ వైసీపీ ని సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది వైసీపీ వ్యతిరేకులు. అయితే ఈ రకమైన ట్రోలింగ్ చూస్తే వైసీపీ శ్రేణులకు మండదా అక్కా.? మండదా తమ్ముడు.? అంటూ పుండు మీద కారం మాదిరి పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు మరికొంతమంది.

Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్‌, జగన్‌లని టచ్ చేయగలరా?

గత ఐదేళ్లు 23…23 అంటూ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ పార్టీని, 4 దశాబ్దాల రాజకీయాయ్ అనుభవం కలిగిన చంద్రబాబుని హేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఎవరు ఎక్కడ 11 అన్నా అది తమనే అన్నారని, తమ పార్టీని ఉద్దేశించి చేసిన విమర్శే అంటూ ఉలిక్కి పడిపోతున్నారు, భుజాలు తడుముకుంటున్నారు.




వీరి ఉలికిపాటుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో వెలుస్తున్న ఈ రకమైన పోస్ట్ లు మరింత మసాలా తో వైసీపీ శ్రేణులకు ఇంకాస్త కడుపు మండేలా చేస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందు వరకు వై నాట్ 175 అంటూ వైసీపీ చేసిన అతికి ఇప్పుడు ఈ రకమైన ట్రోలింగ్ తప్పట్లేదు, తప్పుకాదు అంటున్నారు వైసీపీ ప్రత్యర్థి వర్గం.

Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?