తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై మరింత లోతుగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అలా ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టుని కోరింది వైసీపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డే. అంటే వైసీపి బాగా ఆలోచించుకునే సుప్రీంకోర్టుకి వెళ్ళిందన్నమాట!
అయితే కాంగ్రెస్‌ని చూసి భయపడి కేసీఆర్ మోడీని తెచ్చిపెట్టుకున్నట్లుగా, ఏపీ సిట్‌ని చూసి భయపడి సీబీఐ సిట్‌ని తెచ్చుకున్నారు.
Also Read – అయితే కొడాలి నానికి ముహూర్తం పెట్టేసినట్లేగా?
దానిలో ఇద్దరు సీబీఐ అధికారులతో పాటు ఇద్దరు ఏపీ పోలీస్ అధికారులు కూడా సభ్యులుగా నియమించడంతో జగన్ మావయ్య కంగు తిన్నారు. ఆ నలుగురు కలిసి పాకం పడితే కల్తీ నెయ్యి గుప్పు మంటుందని ఆందోళన మొదలైంది.
జగన్ మావయ్య కళ్ళలో ఆనందం చూడాలని సుప్రీంకోర్టుకి వెళితే, ఇప్పుడు ఆయన కళ్ళలో తీవ్ర ఆందోళన, నైరాశ్యం కొట్టవచ్చిన్నట్లు కనిపిస్తుంటే పాపం వైవీ… కూడా బాధపడే ఉంటారు!
Also Read – నారదుడుకి తక్కువేమీ కాదు.. మన వర్మ
‘సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి చెంపదెబ్బ’ అని హెడ్డింగ్ పెట్టుకొని వ్రాసి పడేస్తే, 24 గంటలు గడవక మునుపే ఆ సంతోషం కాస్తా ఆవిరైపోయింది.
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సిఎం చంద్రబాబు నాయుడు స్వాగతిస్తే, జగన్మోహన్ రెడ్డి ‘సిట్టూ…బిట్టూ అవసరమే లేదు…ఎందుకంటే అసలు విచారణ జరపడానికి అక్కడ ఏమీ జరుగలేదు. ఏమైనా జరిగి ఉంటే కదా… సిట్ విచారణ అవసరం?” అని ప్రశ్నించారు.
Also Read – రేషన్ బియ్యం దొంగలు గప్‌చిప్?
తిరుమలలో ఏమీ జరగనప్పుడు వైవీ సుబ్బారెడ్డిని సుప్రీంకోర్టుకి ఎందుకు పరిగెత్తించారు?విచారణ జరిపించాలని పిటిషన్ ఎందుకు వేయించారు?అని శ్రోతల ప్రశ్నకు సమాధానం లభించదు.
కానీ లండన్ వెళ్ళి చదరంగం ఆడుకునే జగన్మావయ్య సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ పెద్ద సిట్‌తో ఏమి జరుగబోతోందో ముందే కనిపెట్టి చెప్పేశారు.
“అక్కడ ఏమీ జరగలేదు కానీ చివరికి ఏం జరుగుతుందంటే రికార్డులు తారుమారు చేసి ఏదో జరగరాని అనర్ధం జరిగిపోయిందని తేల్చుతారు… అంతే,” అని చెప్పేశారు. అంటే క్లైమాక్స్ ఇలా ఉంటుందని జగన్మావయ్యకి అర్దమైపోయిందన్న మాట! అందుకే కళ్ళలో ఆ నైరాశ్యం… మనసులో ఆ దిగులు… ఆయన మాటల్లో స్పష్టంగా కనబడుతోంది.
అక్రమాస్తుల కేసులలో జగన్, విజయసాయి రెడ్డి అమాయకులు. వివేకా హత్య కేసులో చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి అమాయకుడు… చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి, జోగి రమేష్ అందరూ అమాయకులే. వైసీపి నిండా ఇలాంటి అమాయకులే ఉన్నారు. పాపం అందుకే ఇలా దొరికిపోతున్నారేమో?
మరేం పర్వాలేదు… జగన్మావయ్యకి తప్పులు చేయడం… అధికారులందరి చేత కూడా చేయించి, వెంట తీసుకుపోతుండటం అలవాటే. కానీ ఆలోగా ‘పెద్ద సిట్’పై బురద ఏవిదంగా జల్లాలో జగన్మావయ్య చిన్న హింట్ ఇచ్చేశారు కనుక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైసీపిలో అందరూ మొదలెట్టేయాలి! తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు.