కొండెక్కాలనుకుంటే ఫ్లయిట్ ఎక్కించారు.! అయినా…

ys-jagan-ysrcp

వైస్ జగన్ మోహన్ రెడ్డి తానూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మొదలు పెట్టి విశాఖ రుషికొండ మీద దాదాపు 500 కోట్లతో ఒక విలాసవంతమైన ప్యాలస్ ను నిర్మించుకుని రిబ్బన్ కట్ చేసారు.

ఈ సారి కూడా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ముఖ్యమంత్రిగా వైస్ జగన్ ప్రమాణస్వీకారం విశాఖ కేంద్రంగానే జరుగుతుందని, ఋషి కొండ సాక్షిగా పాలన కొనసాగుతుందని దానికి పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రంగం, ప్రజలు సిద్ధంగా ఉండాలని అందరు ఒక అంచనాకు వచ్చేసారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో 175 సీట్లతో రుషికొండ పాలస్ ఎక్కాలని అని ఆశ పడిన జగన్ కు 11 సీట్లు ఇచ్చి అధికారంతో ఎక్కిన పదవి అహంకారాన్ని దించారు ప్రజలు. దీనితో ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్ నుంచి బెంగుళూర్ ప్యాలస్ కు బెంగుళూర్ ప్యాలస్ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు తిరగడానికి ఫ్లయిట్ ఎక్కుతున్నారు.

ప్రజలలో ఈ స్థాయి వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అన్న ఆలోచన చేయకుండా, తప్పెక్కడ జరిగిందో అని సమీక్షించుకోకుండా ఇంకా అవే అసత్య ప్రచారాలు, అదే ఎదురు దాడి. పార్టీ అధికార ప్రతినిధి నుండి పార్టీ అధినేత వరకు ఇంకా వైసీపీ నేతల తీరు మారడం లేదు.

అధికారంలో ఉన్నప్పుడు వందలమంది సలహా దారులను పెట్టుకుని అడ్డదిడ్డమైన పాలన చేసి 151 నుంచి 11 పడ్డారు. మంత్రులంటే బూతులు తిట్టడం, రాజకీయాలంటే వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, ప్రభుత్వమంటే బటన్ నొక్కడం అనుకున్న జగన్ కు పాలన ఇలా ఉండకూడదు అని తమ ఓటుతో సమాధానం చెప్పారు ఓటర్లు.

అధికార పక్షంలో ఫెయిల్ అయ్యారని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే ఇక్కడ కూడా వైసీపీ తన పంథా మార్చుకోకుండా ఇంకా ప్రజల నుండి పాస్ మార్కులు వేయించుకోలేకపోతుంది.

ప్రతిపక్షంలో ఉంటే వరద విపత్తుని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం, విరాళాన్ని ప్రకటన రూపంలో విడుదల చెయ్యడం, సాయం చెయ్యాల్సిన సమయంలో విహార యాత్రలకు సిద్ధమంటూ కోర్టుల చుట్టూ ఎయిర్ పోర్టుల చుట్టూ తిరగడం చూస్తుంటే ప్రజా సేవ మీద జగన్ కు ఉన్న చిత్త శుద్ధి అర్ధమవుతుందంటూ తలలు పట్టుకుంటున్నారు ఏపీ ప్రజానీకం.

ఇటు పక్క వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బాధితులకు అండగా ఉండాల్సింది పోయి టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు, కూటమి పొత్తు త్వరలోనే విచ్చిన్నం కాబోతుంది అంటూ ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విభేదాలను రెండు పార్టీలకు ముడి పెట్టి కూటమి ప్రభుత్వం పై విష ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ సోషల్ మీడియా.

అయితే ఇటు మచిలీపట్నం జనసేన ముఖ్య నాయకుడు బండి రామకృష్ణ ఈ విషయం పై అధికారికంగా స్పందిస్తూ ఈ విభేదాలతో రెండు పార్టీలకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదు, అది పూర్తిగా వారి వ్యక్తిగతం అంటూ ప్రకటించినప్పటికీ వైసీపీ తన బుద్ధి మార్చుకోవడం లేదు.

2024 జగన్ పరాభవానికి వైసీపీ సోషల్ మీడియా కూడా ఒక ముఖ్య భూమిక పోషించిందనే చెప్పాలి. అయినా వైసీపీ తన రాత మార్చుకోకుండా ఇప్పటికే ఇలా రెండు పార్టీల కార్యకర్తలు రెచ్చగొట్టి రాజకీయ చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.

గతంలోనూ అలాంటి ప్రచారాలే చేసి ఇలాంటి ఫలితాలు దక్కించుకున్నారు. అయినా….వైసీపీలో ఇంచిత్తైన జ్ఞానోదయం రాకపోవడాన్ని ఏమనాలో.

ADVERTISEMENT
Latest Stories