చిన్న చేపలని కాదు… ప్యాలస్‌ దొంగని పట్టుకోండి!

YS Sharmila

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టినప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న తన అన్న జగన్మోహన్‌ రెడ్డితో ఏవిదంగా వ్యవహరించబోతున్నారని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అంచనాలకు మించే ఆమె అన్నతో ఫుట్ బాల్ ఆడేసుకున్నారు.

అదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే ఎన్నికలైపోగానే అన్నతో కలిసిపోతారని చాలా మంది అనుకున్నారు. పక్కలో బల్లెంలా మారిన చెల్లితో రాజీకి జగన్‌ ప్రయత్నించిన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఆమె అన్న పక్కన కాక అన్నకు పక్కలో బల్లెంలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయారు. కనుక విజయవాడ వరదలు మొదలు తిరుమల లడ్డూ ప్రసాదం వరకు అన్నని దూది ఏకీన్నట్లు ఏకుతూనే ఉన్నారు.

ADVERTISEMENT

తాజాగా గనుల వెంకటరెడ్డి అరెస్టుపై కూడా ఘాటుగా స్పందిస్తూ, ఆయనని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేసినవారెవరో అందరికీ తెలుసు. కనుక టిడిపి కూటమి ప్రభుత్వం తీగలు లాగుతూ కాలక్షేపం చేయకుండా ప్యాలస్‌ డొంకని కదిపేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది.

ఇది ఏసీబీ వలకి చిక్కే చిన్న చేప కాదు… రాష్ట్ర సహజ వనరులను, సంపదని తినేసిన పెద్ద తిమింగలం. దానిని పట్టుకోవాలంటే సీబీఐ అనే పెద్ద వల కావాలని వైఎస్ షర్మిల అన్నారు.

అంటే మా అన్నపై కేసు నమోదు చేసి పట్టుకోండి. మీ వల్ల కాదనిపిస్తే మా అన్న కేసుని సీబీఐకి అప్పగించమని మొహమాటం లేకుండా వైఎస్ షర్మిల చెప్పేశారన్న మాట! మరి విజయమ్మ ఏమంటారో?

ADVERTISEMENT
Latest Stories