వివేకా హత్య కేసు తెలంగాణకి బదిలీ.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

YS-Vivekananda-Reddy-Murder-Case-Supreme-Court-Telanganaవైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగడం లేదు కనుక తమకు న్యాయం చేసేందుకు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, వారి కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు జస్టిస్ ఎంఆర్.షా విచారణ జరిపి కడప న్యాయస్థానం నుంచి ఈ కేసు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ తీర్పు చెప్పారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్.షా ఇంతవరకు కేసు దర్యాప్తు, విచారణ జరిగిన తీరుని తప్పు పడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మృతుడి భార్య, కుమార్తె ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు వరకు రావడాన్ని తేలికగా తీసుకోలేము. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాధారాలను నాశనం చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ కేసును తారుమారు చేసేందుకు దురాలోచనతో కూడిన కుట్ర ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. కడపలో విచారణ జరిపితే ఈ కేసులో అసలు దోషులను ఎన్నటికీ పట్టుకోవడం, చట్టప్రకారం శిక్షించడం సాధ్యం కాదని భావిస్తున్నాము. మృతుని కుటుంబ సభ్యుల ప్రాధమిక హక్కులను కాపాడవలసిన బాధ్యత సుప్రీంకోర్టుకి ఉంది. అందుకే ఈ కేసును హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తున్నాము,” అని అన్నారు.

సుప్రీంకోర్టు నిన్న అమరావతి, మూడు రాజధానుల అంశంపై విచారణ జరిపినప్పుడు న్యాయమూర్తుల చేసిన వ్యాఖ్యలను మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ గుర్నాద్ వంటి పలువురు వైసీపీ నేతలు వాటిని తమ ప్రభుత్వానికి అన్వయించుకొని చాలా గట్టిగా మాట్లాడారు. కనుక ఈరోజు వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా తమ ప్రభుత్వానికి అన్వయించుకొని మాట్లాడగలరా?అసలు ఈ తీర్పు గురించి నోరు విప్పి మాట్లాడే సాహసం చేయగలరా?

ADVERTISEMENT
Latest Stories