తిరుమల తో ‘వైఎస్’ ఫ్యామిలీ రాజకీయం…

YSR family political controversies with Tirumala TTD temple

కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఒక్కసారి పరిశీలిస్తే ఏది సరైనదిగా అనిపించదు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడుకొండలను మూడు కొండలు చేస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చారు.

ఇక నేడు వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా తెలుగు రాజకీయాలకు పరిచమైన ఆయన తనయుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి సైతం తండ్రి బాటలోనే అన్నట్టుగా తిరుమలను ఒక రాజకీయ వేదికగా మార్చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ నుంచి ఆయన మంత్రి వర్గంలో ఉన్న రోజా వరకు అందరు తిరుమలను రాజకీయాలలోకి తీసుకొచ్చేసారు.

ADVERTISEMENT

జగన్ డిక్లరేషన్ మొదలు రోజా దర్శనాల వరకు ప్రతిదీ తిరుమలలో రాజకీయమే అనేలా వైసీపీ టీటీడీ రూపురేఖలు మార్చేసింది. శ్రీవారి సేవల ధరలను వేలం పద్దతిలో పెంచుకుంటూపోతూ సామాన్యుడికి అందని ద్రాక్ష లా చేసేసింది.

అలాగే టీటీడీ ఆదాయాన్ని సైతం రాజకీయ హామీల అమలుకు, చర్చ్ ఫాదర్ల జీతాలకు వెచ్చిస్తూ ఏడు కొండలను ఒక ఆదాయ వనరుగా చూసింది. ఇక హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం లో సైతం వైసీపీ అనేక అరాచకాలకు పాల్పడిందంటూ కూటమి ప్రభుత్వం వైసీపీ పై అనేక ఆరోపణలు చేసింది.

అలాగే గత ప్రభుత్వంలో బాలాజీ లడ్డు ప్రసాదం లో వాడిన కల్తీ నెయ్యి పై కేసులు పెట్టి విచారణ జరుపుతుంది. దానికి తోడు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక దేవాలయాల మీద దాడులు జరగడం, విగ్రహాలను అపవిత్రం చేయడం, దేవస్థానాల రథాలను తగలపెట్టడం వంటి చర్యలతో వైసీపీ హిందూ సమాజానికి మరింత దూరమయ్యింది.

ఇక నేడు వైఎస్ కుమార్తె షర్మిల సైతం టీటీడీ చర్యలను తప్పుబడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలను విమర్శిస్తున్నారు. టీటీడీ నిధులతో రాష్ట్రంలో ఆలయాలను నిర్మించాలంటూ బాబు ఇచ్చిన ప్రకటన పై షర్మిల సెక్యులరిజం పేరుతో ధ్వజమెత్తారు.

ఆలయాలను నిర్మించే హక్కు టిటిడి కి లేదని, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తరుపున తానూ ఖండిస్తున్నట్టు ప్రకటించారు షర్మిల. ఇలా చేయడం సెక్యులరిజంకు వ్యతిరేకం అంటూ నినదిస్తున్నారు. అయితే అసలు ఈ వైఎస్ ఫ్యామిలీకి టీటీడీ తో విభేదాలంటి.? ఏడుకొండల వాడితో ఈ వైరాలేంటి.? అనే చర్చ జరుగుతుంది.

దీనితో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తనయుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె వైస్ షర్మిల వరకు వైఎస్ ఫ్యామిలి టీటీడీ తో నాటి నుంచి నేటి వరకు రాజకీయ పోరాటం చేస్తూనే ఉంది అంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.

ADVERTISEMENT
Latest Stories