నన్ను కాపాడి … బాబుని శిక్షించండి మహాప్రభో!

ys jagan 8 pages letter

జగన్‌ కొత్తగా రాజకీయాలలోకి అడుగుపెట్టలేదు. కానీ లడ్డూ వ్యవహారం బయటపడ్డాక జగన్‌ ఇప్పుడు అలాగే తడబడుతున్నారు. సొంత పత్రికలో, సోషల్ మీడియా బ్యాచ్‌తో ఈ వ్యవహారం గురించి అనుకూలంగా సర్టిఫై చేసుకుంటే వైసీపికి శుద్ది జరిగిపోతుందని అనుకుంటున్నారు.

ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం టిడిపి, జనసేనలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అంటే జగన్‌ ఉద్దేశ్యంలో వైసీపిని దెబ్బ తీస్తోందని ఆరోపించారు. అటువంటప్పుడు, టిడిపి, జనసేనలు ఎన్డీయే కూటమిలో, టిడిపి కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వాములుగా ఉన్నప్పుడు తాను ప్రధాని నరేంద్రమోడీకి సిఎం చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేస్తూ లేఖ వ్రాయగానే ఆయనపై చర్య తీసుకుంటారని ఎలా అనుకున్నారో తెలీదు.

ADVERTISEMENT

జగన్మోహన్‌ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ వ్రాశారు. “తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాలతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా, తిరుమల సంప్రదాయాలపై భక్తులకు అనుమానాలు కలిగేలా మాట్లాడారు.

లడ్డూ ప్రసాదం విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చి భక్తులకు తెలియజేయాలి. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించిన సిఎం చంద్రబాబు నాయుడుకి తగిన విదంగా బుద్ధి చెప్పాలి,” అని ఆ లేఖలో వ్రాశారని జగన్‌ సొంత పత్రిక కాదని చెప్పుకున్న సాక్షి మీడియా పేర్కొంది.

ఈ లేఖతో భక్తుడు కోరుకున్నదే దేవుడు వరమిచ్చిన్నట్లు అవుతుంది. ఏవిదంగా అంటే ఈ వ్యవహారంపై సిఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏసీబీ లేదా సీఐడీ చేత విచారణ జరిపిస్తారో అని జగన్‌, వైసీపి నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కను సన్నలలో పనిచేసే ఆ రెంటిలో ఏది విచారణ జరిపినా వైసీపిలో పలువురిపై కేసులు నమోదు అవుతాయని, పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరగక తప్పదని జగన్‌కి కూడా తెలుసు.

బహుశః అందుకే సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నట్లున్నారు. సీబీఐ విచారణ చేస్తే వివేకా హత్య కేసులో దానితో ఆడుకున్నట్లు ఈ కేసులో ఆడుకుంటూ అరెస్ట్ కాకుండా తప్పించుకోవచ్చని జగన్‌ భావిస్తున్నారేమో?

అయితే అది జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు సాగింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి. ఎన్డీయేలో సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా కీలకంగా మారారు. కనుక సీబీఐ చేత విచారణ జరిపిస్తే జగన్‌, వైసీపి ఈ వ్యవహారంలో ఇంకా లోతుకి కూరుకుపోవడం ఖాయం.

ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే దానికి సంబందించి ప్రతీ చిన్న వార్తా జాతీయ మీడియాలో తప్పక వస్తుంది. అప్పుడు జగన్‌ హిందూ వ్యతిరేకి అనే ముద్రపడిపోకుండా ఉండదు. అదే జరిగితే జగన్‌ రాజకీయ జీవితానికి ముగింపు వచ్చేసిన్నట్లే.

ADVERTISEMENT
Latest Stories