వరద ప్రవాహంలో కొట్టుకుపోయే వాడికి చిన్న కర్ర చేతికి అందినా దాని సాయంతో ఒడ్డునపడి ప్రాణాలు కాపాడుకోగలనని ఆరాటపడతాడు. కానీ సాధ్యం కాదని గ్రహించలేడు. ఎందువల్ల అప్పుడు అతను ఉన్న పరిస్థితి అటువంటిది.
వైసీపీ కూడా ఇప్పుడు ఇదే చేస్తోంది. కొన్ని ఎంపీపీ సీట్లు గెలుచుకోవడం కూడా వైసీపీకి మహాద్భుతంగానే కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలలో 175/175 ఎమ్మెల్యే సీట్లు, 25/25 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికి దారుణంగా ఓడిపోయిన వైసీపీకి, ఎంపీపీ సీట్లు గెలుచుకోవడమే చాలా గొప్పగా అనిపించడం, దాని గురించి సొంత మీడియా, సోషల్ మీడియాలో గొప్పగా వ్రాసుకోవడం చూస్తే జాలి కలుగుతుంది.
ముఖ్యంగా ఈ స్థాయి ఎన్నికలలో వై అభ్యర్ధులను గెలిపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగాల్సిరావడం ఇంకా సిగ్గుచేటు కదా?
గ్రామ, మండల స్థాయిలో రాజకీయ పార్టీలు బలంగా ఉండాలంటే ఎంపీపీ సీట్లు కూడా ముఖ్యమే కనుక వైసీపీ అల్పసంతోషాన్ని అర్దం చేసుకోవచ్చు.
వైసీపీకి ఎంపీపీ సీట్లు ముఖ్యమైనప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలకు కూడా ముఖ్యమే కదా? కానీ అవే అధికారంలో ఉన్నప్పుడు ఈ మండల స్థాయి రేసులో అవి వెనకపడటం ప్రమాదపు తొలి హెచ్చరికగా పరిగణిస్తున్నాయో లేదో?




