YS Jagan Social Media

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలొస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కాలినడకన, ట్రాక్టరులో ముంపు గ్రామాలలో పర్యటించి బాధితులకి ధైర్యం చెప్పారు. పంట పొలాల వద్దకు వెళ్ళి నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అప్పుడు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతీరోజూ ముంపు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు నిత్యావసర సరుకులు, మంచినీళ్ళు, చివరికి పశుగ్రాసం కూడా సరఫరా చేసేవారు. చంద్రబాబు నాయుడు సూచన మేరకు మిగిలిన టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా వరద బాధితులకు యధాశక్తిన సహాయం చేశారు.

Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్‌, జగన్‌లని టచ్ చేయగలరా?

చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ముంపు ప్రాంతాలలో పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపడుతుండటం చూసి మేల్కొన్న జగన్మోహన్‌ రెడ్డి, వారం రోజుల తర్వాత తాపీగా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నీట మునిగిన పంటలని చూసేందుకు, అధికారులు పంటపొలాల పక్కన రోడ్డుపై టెంట్ వగైరా ఏర్పాటు చేస్తే, జగన్‌ దానిలో నిలబడి చూసి వెళ్ళిపోయారు.

అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిన జగన్‌ ఎక్కడున్నారు?అంటే మంగళవారం లండన్‌ వెళ్ళేందుకుగాను బెంగళూరు చేరుకొని అక్కడ ప్యాలస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు! అధినేత బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటుంటే వైసీపి నేతలు ఇప్పుడు ఈ భారీ వర్షాలు, వరదలలో బయటకు వస్తారని ఆశించలేము.

Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?

కానీ వైసీపి మీడియా, సోషల్ మీడియా మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంది. “నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ ఢమాల్‌. తేలిపోయిన @ncbn కృత్రిమ ఇమేజ్. వర్షపు దిగ్బంధంలో విజయవాడ నగరం, మంగళగిరి, రాజధాని ప్రాంతం చంద్రబాబు, యంత్రాంగం బేలతనం భారీవర్షాలపై హెచ్చరికలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.

అందుకే విజయవాడలో కొండచరియల ఘటన, నలుగురు మృతి లక్షల మంది ప్రజలు హాహాకారాలు. కనిపించని విపత్తు నిర్వహణ. కనిపించని సీనియర్లు, మంత్రులు. ఉదయం నుంచి పత్రికా ప్రకటనలకే పరిమితం,” అంటూ విమర్శలు గుప్పించింది.

Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని పట్టుబడుతున్న జగన్‌ రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించి, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారిని పరామర్శించకుండా, బెంగళూరు ప్యాలస్‌లో విశ్రాంతి తీసుకుంటుంటే, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారనే స్పృహ లేకుండా వైసీపి సోషల్ మీడియా వెకిలి రాతలు రాస్తుండటం సిగ్గుచేటు.

అయినా ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఏ ప్రభుత్వమైన నష్ట నివారణ చర్యలు, సహాయ కార్యక్రమాలు చేపట్టగలదు తప్ప అవి రాకుండా జగన్ ప్రభుత్వమైనా ఆపగలిగిందా?కనీసం సకాలంలో సహాయ చర్యలు చేపట్టగలిగిందా?అని ఆలోచిస్తే మంచిది.