
మోడీ ప్రభుత్వం నేడు పార్లమెంటులో కీలకమైన వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టబోతోంది. దానిని కాంగ్రెస్, మిత్రపక్షాలు, మజ్లీస్ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టీడీపీ, జనసేనలు ఎన్డీఏలో భాగస్వాములు కనుక ఈ బిల్లుకి మద్దతు తెలుపబోతున్నాయి.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి కానప్పటికీ సాధారణంగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పరటీబీలలుకి వైసీపీ మద్దతు ఇస్తుంటుంది. ఎందుకో అందరికీ తెలుసు. కనుక వైసీపీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
“ముస్లింల విషయంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు మాట తప్పి మోసం చేస్తున్నారని, కానీ తమ అధినేత జగన్ ముస్లింలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చినందున, తాము పార్లమెంట్ ఉభయ సభలలో ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తామని,” ఆ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి చెప్పారు. అంటే రాష్ట్రంలో రాజకీయ మైలేజ్ కోసమే వైసీపీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తోందన్న మాట!
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
మోడీ ప్రభుత్వానికి లోక్‌సభలో ఈ బిల్లుని ఆమోదింపజేసుకోవడానికి తగినంత బలం ఉంది కనుక అక్కడ ఈ బిల్లుని ప్రతిపక్షాలన్నీ కలిసినా ఆపలేవు. రాజ్యసభలో ఎన్డీఏకి బయట పార్టీల మద్దతు అవసరం పడుతుంది. తప్పకుండా బయట మద్దతు లభిస్తుందనే గట్టి నమ్మకం ఉండబట్టే ఈ బిల్లుని నేడు పార్లమెంటులో ప్రవేశపెడుతోంది.
అంటే పార్లమెంటులో ఎలాగూ ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని వైసీపీ గ్రహించింది కనుకనే దానికి వ్యతిరేకంగా ఓట్లు వేసి, రాష్ట్రంలో ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ఆశ పడుతోందని అర్దమవుతుంది.
Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!
ఈ బిల్లుకి టీడీపీ, జనసేనలు మద్దతు ఇస్తున్నాయి కనుక ముస్లిం ఓటర్లను వైసీపీవైపు తిప్పుకోవడానికి ఇదో చక్కని అవకాశంగా జగన్ భావించి దీనిని వ్యతిరేకిస్తున్నారే తప్ప వారిపై ప్రేమతో కానే కాదు.
ఒకవేళ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి వైసీపీ మద్దతు తప్పనిసరి అయితే మరో ఆలోచన చేయకుండా మద్దతు ప్రకటించి అందుకు జగన్ మరో స్టోరీ ఏదో చెప్పేవారే కదా?
ఈ బిల్లు ఎలాగూ పాస్ అవుతుంది కనుక దీనిని తాము వ్యతిరేకించినా మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కలుగదనే ధైర్యంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
జగన్ ప్రతీసారి తాను చాలా తెలివిగా వ్యూహాలు అమలుచేస్తుంటానని గట్టిగా నమ్ముతుంటారు. కానీ చివరికి బోల్తా పడుతుంటారు. ఇప్పుడు అలాగే అనుకోని మళ్ళీ బోల్తా పడతారేమో?రాష్ట్రంలో చిన్న రాజకీయ మైలేజ్ కోసం ఆశపడి మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లుని వ్యతిరేకిస్తే ఏమవుతుంది? అని జగన్ ఆలోచించిన్నట్లు లేదు.