YSRCP Media

ప్రకృతి ప్రళయాల కన్నా, వరదల విధ్వంసాని కన్నా రాష్ట్రాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి వైసీపీ రాజకీయాలు. రాజకీయంగా ఎదగడానికి ఇంతలా దిగజారాలా అన్నంతలా వైసీపీ రోజురోజుకి నైతికంగా పతనమవుతూ వస్తుంది.

Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?

వరదలతో, వర్షాలతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రభుత్వానికి సాయంగా, బాధితులకు చేయూతగా ఉండాల్సిన ప్రతిపక్ష వైసీపీ నీచ రాజకీయాలు చేస్తూ తన నైజాన్ని బయటపెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ప్యాలస్ లో సమీక్షలు చేసిన జగన్ ఇప్పుడు ఫీల్డ్ లో పర్యవేక్షణలు చేస్తున్న బాబు పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.

ఏపీ రాజధాని అమరావతి వరదాలలో మునిగిపోయింది…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు వరదలలో చిక్కుకుంది, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వ నాశనం అయిపోయింది అంటూ రాష్ట్ర భవిష్యత్ ను దెబ్బ తీసేలా వైసీపీ చేస్తున్న వరద రాజకీయానికి ఏపీ ప్రజలు కూడా ఛీ కొడుతున్నారు.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

రాష్ట్రం ముందు వరద నాట్యం చేస్తుంటే ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కోర్టుకెళ్లిన నాయకుడు మాత్రం ప్రజల పక్షాన నిలబడకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వం తో పోరాడుతున్నారు. ఏడు పదుల వయస్సులోను తిండి నిద్ర మానుకుని, పగలు రాత్రి తేడా లేకుండా అలుపెరుగని యుద్ధం చేస్తున్న బాబు పై, కూటమి ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు వైసీపీ నేతలు.

విజయవాడలో జలవిలయం తాండవం ఆడుతుంది. దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూ, మంత్రులను పర్యవేక్షణలకు పంపుతూ, పరిస్థితులను సమీక్షిస్తూ 24/7 బాధిత ప్రాంతంలోనే ఉంటూ ఈ ఒక్క రాత్రి అప్రమత్తంగా ఉండండి అంటూ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు బాబు.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

ఈ విధమైన పాలన చేస్తున్నకూటమి ప్రభుత్వం పై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న విష ప్రచారం చూస్తుంటే రాజకీయం కూడా సిగ్గుతో తల దించుకుంటుంది. విజయవాడలో వరద బాధితులు నిలదీయడంతో అక్కడ నుండి జారుకున్న చంద్రబాబు, రెండు రోజుల నుంచి తిండి నీళ్లు లేకుండా అల్లాడుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వంలో వైస్ జగన్ నిర్మించిన రిటైనింగ్ వాల్ వళ్లే తప్పిన పెను ప్రమాదం అంటూ ఇక్కడ కూడా రాజకీయ మైలేజ్ కోసమే ప్రయత్నిస్తుంది వైసీపీ.

బాధితులు లక్షల్లో ఉంటే అధికారులు వేలల్లో, వ్యవస్థలు వందల్లో, మంత్రులు పదుల సంఖ్యలో ఉంటారు. కాబట్టి బాధితులను చేరుకోవడానికి కొంత సమయం పట్టడం సహజమే. అయినా వారిని కూడా గుర్తించి సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. అయితే ఆ ప్రభుత్వానికి ప్రతిపక్షం కూడా తోడయితే బాధితులకు అందే సాయం శాతం పెరుగుతుంది.




ప్రతిపక్షములో ఉన్నాం ప్రభుత్వం పై బురద జల్లి, రాష్ట్రం పై విషం జిమ్మీ చేతులు కడుక్కుందాం అనుకుంటే అది ఎప్పటికి వైసీపీ కి రాజకీయ లబ్ది చేకూర్చదు అనే విషయాన్ని వైసీపీ గ్రహించాలి. ఇటువంటి సమయంలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, బాధితుల సమచారాన్ని అధికారులకు చేరవేస్తూ, తమ పార్టీ తరుపున వాలంటీర్లుగా బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వానికి సూచనలు చేయడం ప్రతిపక్షం బాధ్యత. బాధ్యతను విస్మరించి బరితెగింపు రాజకీయాలు చేస్తున్న వైసీపీ విధ్వంసాన్ని కోరుకుంటుంది.