వైసీపీ తన ఒక్క ఛాన్స్ చర్యలతో 151 నుంచి 11 కి పతనమై రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించుకుంది. అయినా వైసీపీ వైఖరిలో మాత్రం మార్పు శూన్యమనే చెప్పాలి. పార్టీ క్యాడర్ నుంచి లీడర్, అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరు హింసను రాజకీయంగా మార్చేస్తున్నారు.
క్యాడర్ రప్ప రప్ప అంటే అందులో తప్పేముంది అంటూ అధ్యక్షుడు హింసకు తన ఆమోద ముద్ర వేస్తున్నారు. ఇక పార్టీ లీడర్లు చీకట్లో పని పూర్తి చేసాయి, పొద్దున్నే వెళ్లి ఏమి తెలియనట్టు పలకరించాలి అంటూ హింసను ప్రోత్సహిస్తున్నారు.
అలాగే నాటి కోడి కత్తి నుండి గొడ్డలి వేటు వరకు, నేటి గులక రాయి నుంచి కార్ టైర్ వరకు వైసీపీ రాజకీయం హింస చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ నాగార్జున యాదవ్ తన పార్టీ బ్రాండింగ్ ను నిలబెట్టే ప్రయత్నం చేసారు.
సత్తెనపల్లి లో ఒక హోటల్ కి వెళ్లిన నాగార్జున అక్కడ ఫుడ్ సర్వీస్ లేట్ అయ్యిందనే కారణంగా ఆ హోటల్ యజమాని, అక్కడి సిబ్బంది పై దాడి చేసారు. ఇక అక్కడితో ఆగకుండా మా పార్టీ క్యాడర్ ను పిలిచి మీ హోటల్ ను నామ రూపాలు లేకుండా నాశనం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
అయితే ఈ దాడి ఘటన మొత్తం అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో హోటల్ యాజమాన్యం నాగార్జున మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అయితే గతంలో కూడా నాగార్జున తన దురుసు ప్రవర్తనతో అరెస్టయ్యి కొన్నాళ్ళు జైలుకెళ్లి బైలు మీద బయటకొచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు బడా పారిశ్రామిక వేత్తల నుంచి సాధారణ వ్యాపారస్తుల వరకు ఈ రమైన వైఖరితో దాడులకు పాల్పడి, బెదిరింపు రాజకీయాలు చేయడంతోనే వై నాట్ 175 అంటూ వైసీపీ ముందుకెళితే వై నాట్ 11 అంటూ ఏపీ ప్రజానీకం బదులు చెప్పారు.
ఇప్పుడు వైసీపీ చేతిలో అధికారం కాదు కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినా తన బుద్ది మాత్రం మార్చుకోవడం లేదు. జగన్ ఇప్పటికైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పార్టీ శ్రేణులను దూరం పెట్టకపోతే జగన్ 2.0 వైసీపీ పగటి కలగానే మిగిలిపోయే అవకాసం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.






