నా పని అయిపోయింది… ఇక ప్రభుత్వానిదే బాధ్యత

AB Venkateswara Rao comments on AP Governmentసుప్రీంకోర్టు ఆదేశం మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వేంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2022, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి సస్పెన్షన్ ఎత్తివేసి విధులలోకి తీసుకొన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆయనకు ఇంతవరకు పోస్తిగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టింది. ఉత్తర్వులలో సాధారణ పరిపాలనశాఖ (జీఏడి)లో రిపోర్ట్ చేయాలని సూచిస్తూ, పోస్టింగ్ ఇచ్చే వరకు వెయిటింగ్ పీరియడ్‌గా పరిగణిస్తామని పేర్కొంది.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం సూచించినట్లే నేను జీఏడిలో రిపోర్ట్ చేశాను దీంతో నా పని పూర్తయింది. ఇక నాకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయింటింగులో ఎందుకు ఉంచిందో ప్రభుత్వమే చెప్పాలి. ఇదే విషయమై నేను సీఎస్‌ సమీర్ శర్మను కలిసి వినతిపత్రాన్ని ఇవ్వాలని వెళ్ళాను కానీ ఆయనకు నన్ను కలవడం ఇష్టం లేనట్లుంది. తన అసిస్టెంట్‌కు ఇచ్చి వెళ్ళమని చెప్పారు.

ADVERTISEMENT

ప్రభుత్వం నన్ను అన్యాయంగా రెండేళ్ళు సస్పెండ్ చేసినా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. కానీ సుప్రీంకోర్టు ఆదేశానుసారం నాకు తక్షణమే పోస్టింగ్, ఇక నుంచి నెలనెలా జీతం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాను,” అని అన్నారు.

ముఖ్యమంత్రి వద్దనుకొన్న అధికారిని కలిసేందుకు ప్రభుత్వంలో ఎవరు మాత్రం సాహసిస్తారు? బహుశః అందుకే సీఎస్‌ సమీర్ శర్మ ఆయనను కలిసేందుకు నిరాకరించి ఉండవచ్చు.

ఇక సుదీర్గకాలం పాటు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఏబీవీ వేంకటేశ్వర రావుకి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తనతో ఏవిదంగా వ్యవహరిస్తుందో తెలిసే ఉంటుంది. కనుక ఆయన ముందు రెండే రెండు మార్గాలున్నాయి. 1. ప్రభుత్వంలో చేదు అనుభవాలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండక తప్పదు. 2. వద్దనుకొంటే పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోక తప్పదు. ప్రభుత్వానికి సేవ చేసే ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి ఇటువంటి దయనీయ పరిస్థితి ఎదురవడం చాలా బాధాకరం.

ADVERTISEMENT
Latest Stories