Air India Flight Crash At Ahmedabad

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనేక వందల కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. తీరని శోకాన్ని తెచ్చిపెట్టింది. కళ్ళ ముందే ఇంతటి విధ్వంశం చూసిన ప్రజల హృదయాలు ద్రవిస్తున్నాయి.

ఈ విమాన ప్రయాణంలో దాదాపు 240 మంది దాక ఉన్నట్టు సమాచారం రాగ అందులో ఎవరు ప్రాణాలతో జీవించే అవకాశం లేదంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విమానంలో భారతీయులతో పాటుగా ఇతర దేశాల ప్రయాణికులు కూడా ఉండడం విషాద స్థాయిని పెంచింది.

Also Read – 2029: ఏపీ vs వైసీపీ..?

దేశంలో పెహల్గామ్ దాడి మరువక ముందే, ఆర్సిబి విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాట అనేకమంది అమాయకుల ప్రాణాలు తీసింది. ఈ చేదు ఘటనలు ఇంకా మరువక ముందే ఇప్పుడు ఈ విమాన ప్రమాదం దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. నిముషాల వ్యవధిలోనే ఇంతటి పెను ప్రమాదం, ఈ స్థాయి విధ్వంశం ఊహకు కూడా అందనిది.

మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఈ ప్రమాదం పై కన్నీరు కారుస్తున్నారు, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అయితే కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

Also Read – అభివృద్ధి అవసరమే.. కానీ డెడ్‌లైన్‌ 2029

అయితే ఇక్కడ విమానంలో ప్రయాణించే వారు మాత్రమే కాకుండా ఆ విమానం కూలిన ప్రదేశం జనావాసంలో కావడంతో అక్కడ కూడా అదే తీవ్రతతో ప్రాణ నష్టం జరిగినట్టు అంచనాలు వేస్తున్నారు. ఒక హాస్టల్ భవనం పై విమానం కూలడంతో అక్కడ భోజనం చేస్తున్న మెడికోలు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలొస్తున్నాయి.




అసలు ఈ ఘోర ప్రమాదానికి కారణం సాంకేతిక తప్పిదమా.? లేక కుట్ర కోణమా అన్న అంశంలోనూ విచారణకు ఆదేశాలు వెళ్లాయి. ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు బాధిత కుటుంబాలకే కాదు సామాన్యుడిని సైతం కంటతడి పెట్టిస్తాయి. ఇకనైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు, ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Also Read – టీటీడీలో అన్య మతస్తుల సేవలు తప్పవా?