అలేఖ్య రెడ్డి ఎవరు వదలబోతున్న బాణం.?

Alekhya Reddy Political Entry Sparks AP Politics Buzz

దివంగత నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి తాజాగా చేసిన ఒక రాజకీయ ప్రకటన అటు నందమూరి అభిమానులలో ఇటు టీడీపీ మద్దతుదారులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తానూ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుననట్టు అలేఖ్య రెడ్డి ఒక బ్రాడ్ క్యాస్ట్ కిచ్చిన ఇంటర్ వ్యూ లో ప్రకటించారు.

అయితే ఈ అలేఖ్య రెడ్డి మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి బంధువు కావడంతో అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు అలేఖ్య చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ADVERTISEMENT

నందమూరి ఇంటి కోడలు కావడంతో అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ అనగానే అందరు ఆమె టీడీపీ పార్టీలోకి అడుగుపెడతారు అని భావిస్తారు. అయితే అలేఖ్య తానూ రాజకీయాలలోకి వస్తాను కాను అందుకు ఏ పార్టీ సరైనది అని ఇంకా నిర్దారించుకోలేదని చెప్పారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలేఖ్య ఇంటర్ వ్యూ క్లిప్స్ చూస్తే తానూ ఇప్పటికి నందమూరి కుటుంబం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు అర్ధమవుతుంది. తారకరత్న – అలేఖ్య రెడ్డిలది ప్రేమ వివాహం కావడంతో తమ వివాహం పట్ల తారకరత్న కుటుంబసభ్యులకు సంపూర్ణ అంగీకారం లేదని వారి పూర్తి అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలతో అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ అవకాశాన్ని టీడీపీ ఎలా వినియోగించుకుంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ వైసీపీ మాత్రం తమకు, తమ పార్టీకి పూర్తి సానుకూలంగా మలచుకోగలదు. ఇప్పటికే లక్ష్మీ పార్వతి రూపంతో వైసీపీ ఇది నిరూపించింది కూడా. ఇక ఇప్పుడు అలేఖ్య రెడ్డి వంతు అన్నట్టుగా వైసీపీ పావులు కదపవచ్చు.

అందుకు తెరచాటు లక్ష్మి పార్వతిని ఆయుధంగా చేస్తుందా.? సాయి రెడ్డి ని అస్త్రంగా వాడుతుందా.? లేక సామాజికవర్గ సమీకరణలతో ముడిపపెడుతుందా అనేది చూడాలి. ఇలా వైసీపీ వచ్చిన ఏ అవకాశానైనా తనకు అనుకూలంగా మలచుకుని అలేఖ్య ను తమ వైపు ఆకర్షించుకుని ఆ బాణాన్ని టీడీపీ పై ఎక్కుపెట్టవచ్చు.

పైగా ఇటువంటి రాజకీయాలలో వైసీపీ కి అందివేసిన చెయ్యి కావడంతో ఏపీ రాజకీయాలలో అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ ప్రకటన హాట్ టాపిక్ అవుతుంది. ఇక దానికి తోడు అలేఖ్య విజయసాయి బంధువు కావడం, ఇప్పటికి సాయి, జగన్ కోసం తాపత్రయపడడం,

అసలు సాయి కి వైసీపీ కి ఏర్పడిన రాజకీయ గ్యాప్ కూడా వైసీపీ పొలిటికల్ వ్యూహంలో ఒక భాగమే అంటూ ప్రచారం జరగడంతో ఇప్పుడు అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ ఎవరి బాణంగా మారబోతుంది, అది ఎవరికీ బాణంగా గుచ్చుకోబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories