అప్పుడు కొనేవారు లేరు..ఇప్పుడు కొనలేని దుస్థితి..!

Amaravati project

ఇటు ఆఫ్ లైన్ అటు ఆన్ లైన్ లలో డిస్కౌంట్ మేళ అంటూ ప్రకటనలు వస్తే చాలు ఇక షాపింగ్ కు రెడీ అంటూ అవసరం ఉన్న లేకున్నా ఎదో రోజు ఉపయోగ పడకపోతుందా ఆనం ఉద్దేశముతో ఎగబడి కొంటారు వినియోగదారులు.

ADVERTISEMENT

అయితే ఇది ఒక్క షాపింగ్ విషయంలోనే జరుగుతుందా అనేలా కొన్ని సందర్భాలలో వస్తువు ఎంత తక్కువ ధర పలికిన కొనడానికి ఆసక్తి చూపించరు, అలాగే కొనడానికి అడుగు ముందుకు వేయరు. ఇదంతా దేని గురించా అన్న సందేహం వస్తుందా.? ఏపీలోని రాజధాని అమరావతి, దాని సమీప ప్రాంతాలలోని భూమలు విషయంలో జరిగింది.

2014 విభజిత ఎపీ లో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అయితే బాబు సుదీర్ఘ రాజకీయ అనుభవానికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు. అయితే దానికి తగ్గట్టే బాబు కూడా కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రానికి హైద్రాబాద్ వంటి ఒక మహానగరాన్ని నిర్మించడానికి అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం అనే గ్రామంలో పునాది వేసిన విషయం ఆ పునాదికి వైసీపీ మూడు రాజధానులు అంటూ సమాధి కట్టిన విషయం అందరికి తెలిసిందే.

అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రకటనతో అమాంతం అమరావతి చుట్టూ పక్కల ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే తన పాలనారాహిత్యంతో ఆ వచ్చిన రెక్కలను విరవడమే కాకుండా భూస్థాపితం కూడా చేసారు వైస్ జగన్.

ఎప్పుడైనా భూమి మీద 1 రూ.పెట్టుబడి పెడితే అది పది అవ్వచ్చు 15 అవ్వచ్చు. లేదా కనీసం 1కి 2 అన్నా అవుతుంది. లేదా ఆ ఒకటి ఒకటిగానే మిగులుతుంది కానీ అది 25 పైసలకు పడిపోవడం ఒక్క జగన్ పాలనకే సాధ్యమయ్యింది అనేలా వైసీపీ విధాన నిర్ణయాలు ఉన్నాయి.

గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆకాశం నుండి పాతాళానికి పడింది. టీడీపీ హయాంలో కోటి రూపాయిలు పలికిన ఎకరం భూమి 40 లక్షలకు పడిపోయింది. అయినా కొనేవాడు లేదు. అమ్మేవాడు ఆశగా చూస్తుంటే కొనేవాడు భయంగా చూసే పరిస్థితి.

గత టీడీపీ హయాంలో 10 లక్షల ఎకరం విలువన్న భూమిని 50 లక్షలకు కొన్నవారు, వైసీపీ హయాంలో 50 లక్షలది 10 లక్షలకు అందుబాటులోకి వచ్చినా కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. దీనితో అమరావతి చుట్టూ పక్కల ప్రాంతాలైన తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, తాడికొండ, వెలగపూడి, వెంకట పాలెంలో భూ యజమానులు వినియోగదాయులకు భారీ డిస్కౌంట్లు ప్రకటించినప్పటికీ పెట్టుబడి పెట్టడానికి పెద్దగా ఎవరు ఆసక్తి చూపించలేదు.

మళ్ళీ తిరిగి 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ఊహే ఇక్కడి ప్రజలను భయపడేలా చేసింది. అలాగే ఈ భూముల విలువ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడుతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపించింది. దీనికి తోడు వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తుంది అనే భయంతో మరి కొందరు వెనుకడుగు వేశారు.

అయితే అప్పుడు బాటా రేటులో దొరికినా సరే కొనలేకపోయారు. ఇప్పుడు తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కొందామన్నా కూడా ఇక్కడ భూముల ధరలు అందుబాటులో లేవు. గత వైసీపీ హయాంలో ధైర్యం చేసి ఒక అడుగు ముందుకొచ్చిన వారు మాత్రం ఇప్పుడు వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

వైసీపీ హయాంలో అనావృష్టి ఎదురయితే టీడీపీ హయాంలో అతి వృష్టి అల్లాడిస్తుంది. వైసీపీ హయంలో కొనే సాహసం చేయలేకపోయారు…టీడీపీ హయాంలో కొనేంత స్తొమత లేదు. అప్పుడు భూయజమానులు బాధపడితే ఇప్పుడు కొనుగోలు దారుడు ఆవేదన చెందుతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories