రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ని బూతులు తిట్టిన వైసీపీ నేత అంబటి రాంబాబు వైసీపీ పార్టీకి ఒక ప్రమోషనల్ కంటెంట్ గా మారిపోయారు.
రామ్ గోపాల్ వర్మ తన మూవీ ప్రమోషన్స్ కోసం ఎలా అయితే కాంట్రవర్సీ కంటెంట్ ను ఎంచుకుంటారో వైసీపీ కూడా అదే మాదిరి అంబటి బూతు పురాణాన్ని, దాని ఫలితంగా అంబటి ఎదుర్కుంటున్న ప్రభుత్వ చర్యలను తమ పార్టీకి ప్రమోషనల్ కంటెంట్ గా ముందుకు తెచ్చింది.
ఇక అంబటి రాంబాబు కూడా తన జైలు జీవితాన్ని తన భవిష్యత్ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి గుంటూరు కోర్ట్ కి హాజరైన అంబటి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి తగ్గేదెలా అనే సైగలతో తనను తానూ హీరోగా ప్రమోట్ చేసుకుంటున్నారు.
అయితే ఈ వివాదం నుంచి వైసీపీ పార్టీకి, అంబటి రాంబాబుకి రాజకీయ మైలేజ్ వచ్చిందా.? అది వైసీపీ ఉహించినట్టుగా, అంబటి కోరుకుంటుందా.? అలా కాకుండా భూమ్రంగ్ అవుతుందా అనేది తేలడానికి ఇంకా చాల సమయమే ఉంది.
కానీ అప్పటి వరకు వైసీపీ వై నాట్ 175 నినాదాల మాదిరి అంబటి వ్యవహారాన్ని కూడా వైసీపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది, చేసుకోవాలని భావిస్తుంది. అలాగే ఈ వివాదం తమను, తమ పార్టీకి అనుకూలమే అనే భ్రమను సృష్టిస్తుంది.
అయితే నేడు బైలు మీద బయటకు రావాల్సిన అంబటి సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా అంటూ స్థానికం గా చేసిన బలవంతపు వసూళ్లకు అంబటి పై మరోకేసు నమోదవడంతో ఆయన పై పోలీసులు పిటి వారెంట్ జారీ చేసారు.
ఈ నేపథ్యంలో కేసు విచారణకు స్వీకరించిన నాయ్యస్థానం అంబటికి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీనితో ఆయన రాకకు చేసుకున్న సంబరాలు కాస్త వాయిదా వేయక తప్పలేదు. దీనితో తొందర పది కోయిల ముందే కూసిందా అంటూ వైసీపీ పై సెటైర్లు పేలుతున్నాయి.
ఇక అలాగే అంబటి కూడా తన గుంటూరు ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఏదిఏమైనా అంబటి వ్యవహారం మొత్తానికి వైసీపీ ని నిత్యం ఏదొక రూపంలో మీడియాలో ఉంచుతుంది, పార్టీకి ప్రచారాన్ని తెస్తుంది. మరి ఆ ప్రచారం పార్టీకి, అంబటి అనుకూలమా.? వ్యతిరేకమా.? అనేది తేలాలి.




