హమ్మయ్య అంబటి పరువు కాపాడారు

Ambati Rambabu after heart surgery update

మాజీ మంత్రి అంబటి రాంబాబు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కార్పోరేట్ హాస్పిటల్లో చేరి గుండెకు రెండు స్టంట్స్ వేయించుకున్నారు. ఆయన ఈ విషయం తెలియజేస్తూ నిన్న సోషల్ మీడియాలో ఎవరూ నన్ను పరామర్శించడానికి హైదరాబాద్‌ రావద్దని, రెండు మూడు రోజుల్లో నేనే వచ్చేస్తానంటూ” ట్వీట్‌ చేశారు.

అది ఎవరికీ చేరాలనుకున్నారో వారికి అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చేరింది. కనుక పరామర్శకు బయలుదేరుతారనుకుంటే ఫోన్ పరామర్శతో సరిపెట్టేశారు. అయితే అంబటి రాంబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జగన్‌ ఫోన్ చేసి పరామర్శిస్తున్నప్పుడు, అక్కడే సిద్ధంగా ఉంచుకున్న తన అనుచరులతో వీడియో రికార్డ్ చేయించుకున్నారు. అలాగే స్పీకర్‌ ఆన్‌ చేసి ఫోన్‌లో మాట్లాడారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు.

ADVERTISEMENT

అయితే ఆయన స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడినందున ఆ ఫోన్లో అవతలి గొంతు విన్నప్పుడు అది జగన్‌ది కాదనిపిస్తుంది. ఒకవేళ జగన్‌ మాట్లాడి ఉండి ఉంటే అయన మాటలు, మాట్లాడే తీరు స్పష్టంగా తెలిసిపోతుంది. బహుశః సజ్జల లేదా వెరెవరో ఫోన్ చేస్తే, జగన్‌ ఫోన్ చేశారన్నట్లు అంబటి రాంబాబు నటించారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా అధినేత ఫోన్ చేసి తనని పరామర్శించారని చెప్పుకోవడానికి ఇంత ఆరాటం, వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకోవడం అవసరమా?

ఏది ఏమైనప్పటికీ, జగన్‌ తనకు ఫోన్ చేసి పరామర్శించారని అంబటి రాంబాబు చెప్పుకున్నారు కనుక అయన పరువు జగన్‌ కాపాడినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories