సిఎం చంద్రబాబు మతం గురించి ఇంతసేపు మాట్లాడారే!

Chandrababu Naidu speaks about YSRCP politics and religion

దేశంలో రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో మజ్లీస్ పార్టీ కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. కనుక ఆ పార్టీలో అందరూ ముస్లింలే ఉంటారు.

ఏపీలో వైసీపీ తమది లౌకికవాద పార్టీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ, అది కేవలం క్రీస్టియన్ మతస్తులకు ప్రాధాన్యం ఇస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ADVERTISEMENT

“బయట మేము హిందువులమని చెప్పుకుంటూ, వైసీపీలో చేరినవారు మతం మారాలని ఒత్తిడి చేస్తుంటుంది. వైసీపీలో చేరి మతం మారినవారు చాలా మందే ఉన్నారు. వైసీపీలో క్రీస్టియన్ మతం ప్రదానార్హతగా పరిగణిస్తుంది.

ఇది పార్టీకే పరిమితం కాలేదు. వైసీపీ నేతల కుటుంబాలకు కూడా విస్తరించింది. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

తనని మతం మారాలని జోగి రమేష్ కుటుంబ సభ్యులు వేదించేవారని ఆమె పిర్యాదు చేశారు. ఈవిధంగా వైసీపీ నేతల ఇళ్ళలో కూడా మతమార్పిడిలు సాగుతున్నాయి.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మత మార్పిడిలకు పాల్పడింది. ఎవరు ఏ మతంలో ఉన్నా తప్పు కాదు. కానీ తమ మతాచారాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం సరికాదు,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు నేడు అరకులో సంజీవని పధకం ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు వైసీపీలోని ఈ మరో కోణం ఎత్తి చూపారు. సాధారణంగా అయన మతం గురించి మాట్లాడరు. కానీ తొలిసారిగా ఇంత సేపు వైసీపీ ద్వంద మత విధానం గురించి మాట్లాడారు.

సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఎవరి మత విశ్వాసాలు వారివి. వాటిని గౌరవిస్తూ రాజకీయాలు చేసుకుంటే హుందాగా ఉంటుంది.

టీడీపిలో అన్య మతస్తులు చాలా మందే ఉన్నారు. వారిని పాలల్లో పంచదారలా కలిపేసుకుంది తప్ప మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయలేదు.

కానీ వైసీపీలో క్రీస్టియన్ మతంతో పాటు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికే అత్యంత ప్రాధాన్యత లభిస్తుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అవసరాన్ని బట్టి ఇలా కులం, మతం మధ్య మారుతుండటం వలన విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా?

ADVERTISEMENT
Latest Stories