గమనిక: మా ఎంపీ చేసిన ఆరోపణలకు అర్ధం అది కాదు

Karumuri_Nageswara_Raoవైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతోందని, మిల్లర్లు, అధికారులు కలిసి రైతుల ఆధార్ లింక్ చేయకుండా మోసం చేస్తున్నారని, దీనిపై కోనసీమ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసి సీబీసీఐడీ విచారణ కోరుతానని అన్నారు.

ఆయన చేసిన ఈ ఆరోపణతో వైసీపీ ప్రభుత్వంపై మచ్చ పడుతుంది కనుక నష్టనివారణకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రంగంలో దిగారు.

ADVERTISEMENT

అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రబీ సీజనులో ధాన్యం కొనుగోలులో ఎటువంటి కుంభకోణం జరగలేదు. మా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈకేవైసీలో జాప్యం జరుగుతోందని దాని వలన రైతులు నష్టపోతున్నారనే ఆవేదనతో ఆవిదంగా అన్నారు. ధాన్యం కొనుగోలులో సీబీసీఐడి చేత విచారణ జరిపించాల్సిన తప్పులు ఏమీ జరిగిపోలేదు. పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకొని ఎక్కడైనా లోపం జరిగినట్లు తెలిస్తే బాధ్యులపై చర్యలు తీసుకొంటాము,” అని అన్నారు.

ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరగలేదని చెపుతూనే ఈకేవైసీలో జాప్యం జరుగుతోందని దాని వలన రైతులు నష్టపోతున్నారని చెప్పడానికి అర్ధం ఏమిటి?ధాన్యం కుంభకోణం జరుగకపోతే అపార రాజకీయ అనుభవజ్ఞుడు, పార్టీలో సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈవిదంగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా కుంభకోణం జరిగిందంటూ ఎందుకు మాట్లాడుతారు?అలా మాట్లాడితే తమ ప్రభుత్వాన్నే తప్పు పట్టినట్లు అవుతుందని ఆయనకు తెలియదనుకోవాలా?కనుక నష్ట నివారణ గురించి ఆలోచించే బదులు నష్టపోతున్న ధాన్యం రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories