బీజేపీ ఇన్ డెంజర్ జోన్.?

BJP flag symbolizing alliance strategy debate in Andhra Pradesh and Telangana

రెండు తెలుగు రాష్ట్రాలలో తమ రాజకీయం ఎలా ఉండబోతుంది, ఏ పార్టీల మధ్య మైత్రి బంధాన్ని కొనసాగించబోతుంది, ఏ పార్టీని ప్రత్యర్థిగా భావిస్తుంది.? ఏ పార్టీ తో ఉన్న తెరచాటు బంధాలను బద్దలుకొట్టాలని భావిస్తుంది.? అనే విషయంలో బీజేపీ సరైన స్టాండ్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందా.?

అవును, ప్రస్తుతం బీజేపీ ఇన్ డెంజర్ జోన్. మూడోసారి వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, హ్యాట్రిక్ ప్రధాని మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోడీ పరిస్థితి చూస్తే గతంలో మాదిరి ఈసారి బీజేపీ తనకు తానుగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని సాధించుకోలేకపోయింది.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్, బీహార్ ఎంపీ ల గెలుపుతో కన్ను లొట్ట పోయి ప్రాణం దక్కించుకున్న చందంగా బీజేపీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏపీలో కూడా చివరి నిమిషం వరకు టీడీపీ, జనసేన పొత్తుకు మద్దతు ఇవ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న బీజేపీ ఎట్టకేలకు ఆఖరి నిముషంలో కూటమిలో భాగమయ్యింది.

అదే భాగస్వామ్యం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి పునాదిగా మారింది. అయితే బీజేపీ ఇటు కూటమిలో భాగమయినప్పటికీ వైసీపీ తో ఇప్పటికి తెరచాటు బంధాన్ని కొనసాగిస్తుందనే భావన ఇక్కడ ఏపీ ప్రజలలో బలంగా ఉంది.

అలాగే అటు తెలంగాణలో సైతం బీజేపీ అక్కడ వైసీపీ కి మిత్ర పక్షమైన బిఆర్ఎస్ పార్టీ తో తెరచాటు రాయబారాలు సాగిస్తుంది అనే అభిప్రాయం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయంశంగా మారింది.

గతంలో మాదిరి బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు కళ్ళ సిద్ధాంతంతో, ద్వంద్వ వైఖరితో ఇటు మిత్ర పక్షాలకు అటు పార్టీ శ్రేణులకు ఒక స్పష్టత లేని రాజకీయం చేస్తే రేపటి రోజున కేంద్రంలో బీజేపీ అధికారం అనేది గాల్లో పెట్టిన దీపం మాదిరి రెపరెప లాడుతుంది.

ఇప్పటికే దేశంలో మూడు సార్లు బీజేపీ అధికారంలో ఉండి ప్రభుత్వ వ్యతిరేకతను ఎంతోకంత పెంచుకుంటూ పోతుంది. ఇటువంటి సమయంలో తమ మిత్ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లకపోతే అది బీజేపీ కే చేటు చేస్తుంది.

ఇప్పుడు ఏపీలో గెలిచిన ఎంపీ సీట్లు బీజేపీ ని ఎంత బలంగా నిలబెట్టాయో రేపటి రోజున ఆ బలమే బీజేపీ కి ఇక్కడ కూటమికి భరోసా అవ్వగలగాలి. అలాకాకుండా ఇప్పటికి బీజేపీ వైసీపీ తో అజ్ఞాత బంధాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగితే దాని ఫలితం కూటమి కంటే బలంగా బీజేపీ ని తాకుతుంది.

అలాగే తెలంగాణలో సైతం బీజేపీ బిఆర్ఎస్ వైపా.? లేక ఏపీలో ఉన్న కూటమి వైపా.? లేక ఒంటరి పోరాటమా.? అనేది తేల్చుకోవాలి. దానితగ్గ రాజకీయం చేస్తూ ముందుకెళ్లాలి. గతంలో మాదిరి బీజేపీ ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని లైట్ తీసుకోవడానికి ఆస్కారం లేదు.

ఎప్పుడు ఏ ఎంపీ స్థానం బీజేపీ కి బలంగా మారుతుందో ఊహించలేని పరిస్థితి. కాబట్టి బీజేపీ రెండు రాష్ట్ర రాజకీయాలలో ఒక స్పష్టమైన రాజకీయ విధానాలతో రాజకీయం చెయ్యాలి, అందుకు తగ్గ విధంగా దాని ఆచరణలో కూడా చూపించగలగాలి.

ADVERTISEMENT
Latest Stories