brs-kcr

“యస్! తెలంగాణ నా సొంత జాగీరు… కాదంటారా?” అని గర్వంగా ప్రశ్నించిన మాజీ సిఎం కేసీఆర్‌, ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నా ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదు. తెలంగాణలో వరదలు వచ్చినా బయటకు రావడం లేదు.

చివరికి కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య పెద్ద యుద్ధాలు జరుగుతున్నా బయటకు రావడం లేదు. ఫామ్‌హౌస్‌లో యాగాలు చేసుకుంటూ కేసీఆర్‌ కాలక్షేపం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః బయటకు వెళ్ళి రాజకీయాలు చేసేందుకు ఇది మంచి సమయం కాదని జ్యోతిష్యులు చెప్పారేమో? లేదా యాగం పూర్తి చేశారు కనుక యాగఫలం దక్కాలంటే మంచిరోజు చూసుకొని బయటకు అడుగు పెట్టాలని ఎదురుచూస్తున్నారేమో?తెలీదు కానీ కేసీఆర్‌ లేని డ్రైవర్ లెస్ గులాబీ కారు అగమ్యంగా ప్రయాణిస్తోంది.

Also Read – తప్పుకుంటున్నారా…తప్పిస్తున్నారా..?

ఇందుకు తాజా ఉదాహరణగా కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య జరిగిన గొడవలలో ‘బ్రతకడానికి వచ్చినవాళ్ళు’ అని అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు జారడం, హరీష్ రావు కూడా ఆయనని వెనకేసుకు రాలేకపోవడం, అందరూ కలిసి కాంగ్రెస్ నేతలకి అడ్డంగా దొరికిపోవడాన్ని చెప్పుకోవచ్చు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మిగిలిన అన్ని జిల్లాలలో ఓడిపోయినా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో అన్ని సీట్లు గెలుచుకుందంటే ఆంద్రా సెటిలర్స్ ఓట్లే కారణం.

Also Read – ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందేమో… జగన్‌ డౌట్!

అందుకే సిఎం రేవంత్‌ రెడ్డి “బిఆర్ఎస్ పార్టీకి ఆంద్రవాళ్ళ ఓట్లు కావాలి కానీ ఆంధ్రావాళ్ళు అక్కర్లేదా? ఆంధ్రావాళ్ళంటే బిఆర్ఎస్ నేతలకు అంత చులకనా?” అని ప్రశ్నించడంతో, అంతవరకు పాడి కౌశిక్ రెడ్డితో కలిసి రచ్చరచ్చచేసిన హరీష్ రావు కూడా కంగు తిన్నారు.

ఇది వరకు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా హైటెక్ సిటీ వద్ద ఐ‌టి ఉద్యోగులు ధర్నా చేసినప్పుడు, కేటీఆర్‌ నోరు జారినందుకు లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ అప్పుడే ఆ విషయం మరిచి, మళ్ళీ ఆంధ్రా సెటిలర్స్‌ గురించి చులకనగా మాట్లాడి వారిని బిఆర్ఎస్ పార్టీకి దూరం చేసుకున్నారు.

Also Read – ఒక్క ‘దేవర’ కే పట్టిన చిక్కా..?

వచ్చే ఏడాది జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు చాలా కీలకం. ఈ విషయం కాంగ్రెస్‌కి బాగా తెలుసు. బిఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. కానీ ఆంధ్రావాళ్ళ గురించి బిఆర్ఎస్ నేతల మనసులో ఉన్న చులకనభావాన్ని ఈవిదంగా మరోసారి బయటపెట్టుకొని, వారిని ఇంకా దూరం చేసుకోవడమే కాకుండా వారందరూ కాంగ్రెస్ పార్టీ వైపు వారు మోగ్గేలా చేశారు.




కేసీఆర్‌ బయట ఉండి ఉంటే ఈవిదంగా జరగేదా?అంటే జరిగినా వెంటనే ఆయన పరిస్థితిని సరిదిద్దేవారు. కానీ గ్యారేజీ నుంచి బయటకు వచ్చిన గులాబీ కారుకి ‘డ్రైవర్ లెస్ టెక్నాలజీ’ పనిచేయకపోవడంతో అడ్డదిడ్డంగా పరుగులు పెడుతోంది. మళ్ళీ గ్యారేజీకి వెళ్ళక తప్పేలా లేదు.