బిఆర్ఎస్ ప్రాంతీయ రాజకీయం మొదలుపెట్టింది. పార్టీ కష్టంలో ఉన్న ప్రతిసారి బిఆర్ఎస్ కు ఈ ప్రాంతీయవాదం ఒక ఆక్సిజన్ మాదిరి పని చేస్తుంది.
అయితే తినగా తినగా గారెలు కూడా చేదుగా మారుతాయి అనే సామెత మాదిరి వినగా వినగా ఈ ప్రాంతీయవాదం తో కూడిన రాజకీయం కూడా ప్రజలలో విసుగు తెప్పిస్తాయి.
ఇప్పుడు బిఆర్ఎస్ చేస్తున్న రాజకీయం కూడా ఇదే మాదిరి ఏపీ వాసులలో అసహనాన్ని, తెలంగాణ ప్రజలలో విసుగును తెపిస్తున్నాయి.
వృధాగా సముద్రంలో కలిసిపోయే గోదావరి నీళ్ల మీద బిఆర్ఎస్ రగులుస్తున్న రాజకీయ చిచ్చు రోజురోజుకి ఉగ్ర రూపం దాల్చుతుంది.
కవిత తో మొదలైన ఈ రాజకీయం ఇప్పుడు కేటీఆర్, హరీష్ ను దాటి కేసీఆర్ వరకు పాకింది. దీనితో కేసీఆర్ ఆదేశాల మేర ఏపీలో నిర్మితమవుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ నేతలు స్వరం పెంచారు.
ADVERTISEMENT
ఇందులో భాగంగా నేడు మీడియా ముందుకొచ్చిన హరీష్ రావు నిన్న లోకేష్ చేసిన వ్యాక్యలను తమకు తగ్గట్టుగా మార్చుకుంటూ వాటికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుమతులు లేవు అంటూ లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, కానీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బిఆర్ఎస్ అన్ని అనుమతులు సాధించిందంటూ మొదలుపెట్టారు.
అలాగే పనిలో పనిగా బాబు పై కూడా నాలుగు విమర్శలు చేసిపోయారు హరీష్. అయితే ఇదంతా కూడా హరీష్ తన బావ కళ్ళల్లో ఆనందం కోసం చేసారా.? లేక తమ ఆత్మ బంధువు వైసీపీ అధినేత జగన్ ముఖంలో చిరునవ్వు కోసం చేసారా.? అన్నది హరీష్ కే ఎరుక.
ADVERTISEMENT






