
రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు మొత్తం అరెస్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇందులో రెండు రాష్ట్రాల అధికార పార్టీలు కూటమి, కాంగ్రెస్ లు గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి పై చర్యలకు దిగుతున్నారు.
అయితే వాటిని తమకు అనుకూలంగా, తమ పార్టీకి సానుకూలంగా మలచుకోవడానికి రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు పోటీలు పడుతున్నాయి. అందుకు గాను వైసీపీ అందగాళ్లలంతా అరెస్టులు అంటూ ఆ పార్టీ అధినేత వైస్ జగన్ జైలు యాత్రలు చేస్తున్నారు.
Also Read – లోకేష్ -కేటీఆర్…రహస్య భేటీ.?
ఇక ఇటు బిఆర్ఎస్ విషయానికొస్తే, ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలోని నాయకులకన్న ఆ పార్టీ మూల స్తంభాలైన కేసీఆర్, హరీష్, కేటీఆర్ పై కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా కేటీఆర్ ఫార్ములా ఈ కేసు, కేసీఆర్, హరీష్ కాళేశ్వరం పై నమోదయిన కేసులతో బిఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం సానుభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.
ఇందుకు గాను ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరయిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రకమైన రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా విచారణకు హాజరవుతాను, కానీ పెద్దలు కేసీఆర్, హరీష్ రావు ను కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి రేవంత్ సర్కార్ పైశాచిక ఆనందం పొందవచ్చు,
Also Read – నీళ్ళు వాడుకోలేరు.. నీళ్ళ రాజకీయాలు మానుకోరు
అలాగే ఇప్పుడు నన్ను విచారణ పేరుతో మానసికంగా క్షోభ పెట్టి రాక్షసానందం అనుభవించవచ్చు, అలాగే నన్ను అరెస్టు చేసి సంతృప్తి పడవచ్చు, కానీ తెలంగాణ కోసం గతంలోనే అరెస్టయ్యి జైలు వెళ్లివచ్చిన నన్ను ఈ అరెస్టులు భయపెట్టలేవు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పరమార్ధం సానుభూతి అస్త్రమేనా.? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో నడుస్తుంది.
అసలు రేవంత్ సర్కార్ ఇలా కేసీఆర్, హరీష్, కేటీఆర్ ను అరెస్టులు చేస్తే అది వారి ప్రభుత్వానికే నష్టాన్ని చేకూరుస్తుంది అన్న విషయం రేవంత్ కు తెలియనిది కాదు. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న ఈ తరుణంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల పై కాంగ్రెస్ అంత దూకుడుగా రాజకీయ అడుగులు వేస్తుందా.?
Also Read – ప్రధాని, సిఎం స్థాయి ఊరికే లభిస్తుందా బ్రదర్?
తద్వారా స్థానిక ఎన్నికల ఫలితాలు తలక్రిందులైతే, రాబోయే నాలుగేళ్లు రేవంత్ సర్కార్ కి గడ్డుకాలం తప్పదు అన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియనిదా.? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ అరెస్టు పై అంత తొందర లేకపోయినా కేటీఆర్ తానూ అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానంటూ చేస్తున్న వ్యాఖ్యలు పరోక్షంగా తెలంగాణలో బిఆర్ఎస్ బలోపేతానికి కేటీఆర్ వేస్తున్న పునాదులుగానే భావించవచ్చు.
ఇక ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఏపీ లిక్కర్ స్కాం కేసులో సాక్ష్యాలన్నీ తాడేపల్లి ప్యాలస్ వైపే పరుగులు పెడుతున్నాయి. అయితే త్వరలో ఈ కేసులో వైస్ జగన్ కూడా అరెస్టు కాబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు, వైసీపీ ముఖ్య నేతల నోటి నుంచి పారీ క్యాడర్ కు పరోక్ష సంకేతాలు రావడంతో వైసీపీ కూడా తమ పార్టీ పేటెంట్ రాజకీయమైన సానుభూతి అస్త్రాన్ని మరోసారి బయటకు తీయడానికి సిద్దపడింది.
మరి ఇందులో ఏ పార్టీ నాయకులు అరెస్టవుతారో.? ఏ పార్టీ దానిని తన పార్టీ రాజకీయ లబ్ది కోసం వాడుకుతుందో.? చూడాలి. అయితే ప్రతిపక్ష నాయకుల అరెస్టుల మీద మీడియాలో వస్తున్న కథనాలో, నాయకులు చేస్తున్న పరోక్ష సంకేతాలు ఆచరణ రూపంలోకి రావడం అంత ఈజీ కాదు అనేది వాస్తవం. ఇవన్నీ కూడా తమ తమ పార్టీల రాజకీయ లబ్ది కోసం నాయకులు చేసే ఆర్భాట ప్రచారాలుగానే మిగిలిపోయే అవకాశాలు లేకపోలేదు.