కేసులు, అరెస్టులైపోయాయి… ఇక ఆస్తులు జప్తు చేస్తారట!

Chandrababu Naidu Arrest Conspiracy

తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ళలోనే సిఎం కేసీఆర్‌ తన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలో నంబర్: 1 స్థానంలో నిలిపి చూపించినప్పటికీ, బిఆర్ఎస్ పార్టీ నేడు ఎన్నికలలో ఎదురీదుతుండటం, 119స్థానాలకి 72-76 స్థానాలు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని సర్వేలు చెపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

కానీ జగన్మోహన్‌ రెడ్డిపై ఎన్ని కేసులున్నప్పటికీ 2019 ఎన్నికలలో ఆంధ్రా ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. కేసీఆర్‌తో పోలిస్తే వైసీపి ఇంత మెజార్టీతో అధికారంలోకి రావడం ఎంత గొప్ప విషయమో నేటికీ వైసీపిలో ఎవరూ గ్రహించిన్నట్లు లేదు. గ్రహించి ఉంటే తెలంగాణతో పోటీ పడుతూ ఏపీని అభివృద్ధి చేసి చూపేవారు.

ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన వైసీపి పాలనలో నేటికీ అదే పందాలో సాగిపోతోంది. ఆస్తులు జప్తు చేస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించడమే ఇందుకు మరో తాజా ఉదాహరణగా పేర్కొనవచ్చు. నిజమే! ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హర్షించలేము.

మరి సిఎం జగన్మోహన్‌ రెడ్డి మొదలు వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు టిడిపి, జనసేన, బీజేపీ నేతలను ఉద్దేశ్యించి చాలా అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా?జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి ఎంత అనుచితంగా మాట్లాడుతున్నారో అందరూ వింటూనే ఉన్నారు.

వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి గత కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని ఉద్దేశ్యించి సోషల్ మీడియాలో ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ దృష్టికి రాలేదా?వారందరిపై కూడా చర్యలు తీసుకోగలరా?వారి ఆస్తులు కూడా జప్తు చేయగలరా?

ఏపీ సీఐడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన సన్నితుల ఆస్తులను జప్తు చేసేందుకు కూడా సిద్దమవుతుండటం ఈ రాజకీయ వేదింపులకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసుతో సహా ఏ కేసులో కూడా ఇంతవరకు ఏసీబీ కోర్టు నేరం జరిగిన్నట్లు నిర్ధారించలేదు. దోషులను ధృవీకరించ లేదు. తీర్పు చెప్పనేలేదు. కానీ ఏపీ ఫైబర్ నెట్‌ కేసులో చంద్రబాబు నాయుడుతో సహా ఆయన సన్నిహితులకు చెందిన ఏడు ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఐడీ నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేయడాన్ని ఏమనుకోవాలి?

ఇప్పుడు హడావుడిగా ప్రతిపక్ష నేతల ఆస్తులు జప్తు చేస్తే, ఒకవేళ రేపు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఈ కేసులన్నిటినీ కొట్టివేస్తే అప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకొంటారు? ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే అప్పుడు ఈ కేసులన్నిటికీ ఎవరూ బాధ్యత వహిస్తారు? కేసులు నమోదు చేసిన సంబందిత అధికారులా లేక వైసీపి నేతలా?ఆలోచించుకొంటే మంచిదేమో?

ADVERTISEMENT
Latest Stories