
తల్లిని, చెల్లిని మెడ పట్టుకొని బయటకు గెంటి, కోర్టుకీడ్చిన వాడికి ‘తల్లికి వందనం’ అంటే వెటకారంగానే ఉంటుంది.
అమ్మఒడి పేరుతో ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి రూ.10,000 ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఒక్కరికే పరిమితం చేసి, మళ్ళీ దానిలో రూ.2-3,000 కోసుకొని చేతిలో పెట్టినవాడికి, ‘తల్లికి వందనం’ అంటే నమ్మడం కష్టమే.
Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు
అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఇదిగో మీకు 15 వేలు.. ఇదిగో మీకు 15 వేలు.. అంటూ జగన్, వైసీపీ నేతలు వెటకారాలు చేసేవారు.
సిఎం చంద్రబాబు నాయుడు అప్పుడు స్పందించలేదు. కానీ తమని అవహేళన చేసిన జగన్, వైసీపీ నేతలందరికీ చెప్పుతో కొట్టినట్లు, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నేటి నుంచే ‘తల్లికి వందనం’ పధకం అమలు చేశారు. దీని కోసం రూ. 8,745 కోట్లు విడుదల చేశారు.
Also Read – చీకట్లో వేసేసి పగలు పరామర్శించాలట!
రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్ధుల చదువుల కొరకు వారి తల్లుల ఖాతాలలో రూ.15,000 చొప్పున నేటి నుంచే నగదు జమా అవుతోంది.
అమ్మఒడి పధకం సరిగ్గా అమలు చేయలేక పోయిన గురించి జగన్ & కోకి అసలు ఈ పధకం గురించి మాట్లాడేందుకు నైతిక హక్కు ఉండదు.
Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం
కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఈ పధకాన్ని అమలుచేసి చూపిస్తున్నారు. కనుక ఇక నుంచి ఈ పధకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయంటూ జగన్ & కో దుష్ప్రచారం మొదలుపెట్టడం ఖాయం.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.3,000 పింఛను ఇవ్వడానికి 5 ఏళ్ళు సమయం తీసుకున్నారు. దాని గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రూ.4,000 పెంచి అందించినప్పుడు, అదే నోటితో ఆయనని కూడా మెచ్చుకోవాలి కదా?
కానీ దానిని పట్టించుకోని జగన్ & కో ‘అమ్మకు వందనం’ పధకం గురించి అవహేళన చేశారు. ఎందుకంటే, తాము చేసిన అప్పుల భారంతో క్రుంగిపోతున్న కూటమి ప్రభుత్వం ఈ పధకాన్ని అమలుచేయలేదనే ధైర్యంతోనే! కానీ చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పారు. కుక్కకాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదే కదా?