కాకమ్మ కబుర్లు లేవ్… కర్నూలులో హైకోర్టు బెంచ్!

high-court-chandrababu-krurnool

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిలాగా సిఎం చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు అంటూ కాకమ్మ కబుర్లు చెపుతూ కాలక్షేపం చేయడం లేదు. అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి చకచకా ఏర్పాట్లు చేశారు.

టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారమే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. దీని కోసం మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు.

ADVERTISEMENT

ప్రస్తుతం ఎన్డీయేలో సిఎం చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. కనుక ఈ ప్రతిపాదనకు కేంద్రం, సుప్రీంకోర్టు రెండూ ఆమోదముద్ర వేయడం ఖాయంగానే భావించవచ్చు.

సిఎం చంద్రబాబు నాయుడు మరో గొప్ప ప్రతిపాదన చేశారు. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి నిర్వహించాలని అనుకుంటున్నామని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

దేశవ్యాప్తంగా లా కాలేజీలు, యూనివర్సిటీలు చాలానే ఉన్నాయి. అయితే విదేశాలలో లేదా విదేశీ కంపెనీలకు న్యాయవాదులుగా పనిచేయాలనుకునేవారు మళ్ళీ దాని కోసం ఆయా దేశాల చట్టాలు, న్యాయశాస్త్రాలను చదవాల్సి ఉంటుంది.

కనుక అమరావతిలో ఈ అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే, భారత్‌తో సహా విదేశాలలో న్యాయవాదులుగా పనిచేసేందుకు అవసరమైన భోధన, అర్హత లభిస్తాయి. సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రతిపాదన ఆయన దూరదృష్టికి మరో నిదర్శనమని చెప్పవచ్చు. దీని ఏర్పాటుకి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

సిఎం చంద్రబాబు నాయుడు మరో రెండు ముఖ్యనిర్ణయాలు తీసుకున్నారు. టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జూనియర్ న్యాయవాదులు తమ వృత్తిలో నిలద్రొక్కుకునే వరకు నెలకు రూ.10,000 గౌరవ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ హామీ అమలుచేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సిఎం చంద్రబాబు నాయుడు మరోచక్కటి నిర్ణయం కూడా తీసుకున్నారు. లా కాలేజీలలో న్యాయవిద్య అభ్యసించి బయటకువచ్చిన జూనియర్ న్యాయావాదులకు, ఉద్యోగం, ప్రాక్టీస్ కోసం అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఓ అకాడమీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT
Latest Stories