సాక్షి లో వచ్చిన ‘అమరావతి సెక్స్ వర్కర్ల రాజధాని’ అనే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. ఈ వీడియో అటు సోషల్ మీడియా మరియు ఇటు వాట్స్ అప్ లలో కూడా వైరల్ అయ్యింది.
దీనితో అమరావతి ప్రజలు, ముఖ్యంగా అక్కడి మహిళలు తమకు జరిగిన అవమానానికి గాను రోడ్ల మీదకు వచ్చి సాక్షి మరియు వైసీపీ కి వ్యతిరేకంగా నిరశన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్టు చేయగా, అసలు ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మరో ఉన్మాది కృష్ణంరాజు పరారీలో ఉన్నారు.
తనకు అనుకూలంగా న్యాయస్థానంలో ముందస్తు బెయిలు దొరికేవరకు కృష్ణంరాజు అజ్ఞాతంలో ఉండడానికి ఎవరు సహకరిస్తారు అనేది అందరికి తెలిసిన వాస్తవమే. అయితే వాటినే నిర్దారిస్తూ కృష్ణంరాజు జగనన్న కనెక్ట్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక వీడియో విడుదల చేసారు.
ఇది వైసీపీ సోషల్ మీడియా అధికారిక హ్యాండిల్ కావడంతో కృష్ణరాజు కి తెరచాటు మద్దతు పలుకుతున్న ఆ రాజకీయ శక్తి ఎవరన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియోలో కృష్ణంరాజు అమరావతి మహిళలను కించపరిచేలా తానూ చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం పచ్చాత్తాపం చూపించడం లేదు.
అయితే పరోక్షంగా ఈ నేరాన్ని మోస్తున్న సాక్షి యాజమాన్యం వైస్ భారతి, వైసీపీ అధినేత వైస్ జగన్ పట్ల జాలి చూపిస్తున్నారు. ఈ ఘటనకు వారికి ఎటువంటి సంబంధం లేదు అనేలా కృష్ణంరాజు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దీనితో ఇటువంటి వారికి వైసీపీ మద్దతు ఏవిధంగా దక్కుతుందో అన్న విషయం అందరికి తెలిసొచ్చింది.
ఇక తన వీడియో తో వైసీపీ చిక్కులలో పడుతుంది అని గ్రహించిన కృష్ణంరాజు ఈసారి ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరో సందేశాన్ని పంపించారు. ఇక్కడ కూడా తానూ చేసిన పని తప్పు, తానూ చేసిన వ్యాఖ్యలు అత్యంత హీనమైనవి అనే భావన అతని మాటల్లో వినిపించలేదు.
అమరావతి లో వేశ్యలు పట్టుబడ్డారు అనే వార్తలను ఉటంకిస్తూ, APTV జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో వాటిని బయటపెట్టారు. ఇది పూర్తిగా ప్రజలను రెచ్చకొట్టే ధోరణిలోనే ఉంది. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఇటువంటి వార్తలు సర్వ సాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి.
అటువంటి వార్తలను ఆధారం చేసుకుని ఆ ప్రాంతంలోని మహిళలంతా అంతే, ఆ ప్రాంతమంతా వేశ్యల నగరమే అంటూ ప్రకటనలు ఇవ్వడం కృష్ణంరాజు కి వైసీపీ వైరస్ సోకిందా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనవి కావు, సమర్ధనీయం కాదు. ఇటువంటి వారి ప్రవర్తన సమాజానికే కాదు రాష్ట్రానికి కూడా అత్యంత ప్రమాద కరం. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ ప్రజలు నుంచి ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా వైసీపీ సాక్షి కి సాయం కాదు ప్రజలకు న్యాయం చెయ్యాలి.
ఇటువంటి ఉన్మాదులకు కాపుకాయడం మానేసి వారిని చట్టం ముందు నిలబడితే అది వైసీపీ కే మంచిది. లేకుంటే సాక్షితో తో పాటుగా వైసీపీ కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదు.




