డామిట్! కధ ఇలా అడ్డం తిరిగిందేమిటి?

Minister narayana arrested Released Bail YSRCP YS Jaganమాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పి.నారాయణ అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఐడి పోలీసుల అత్యుత్సాహానికి చిత్తూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సులోచనారాణి మొదటే బ్రేకులు వేసారు. మంగళవారం రాత్రి పోలీసులు నారాయణను ఆమె ఎదుట ప్రవేశపెట్టినప్పుడే సరైన సాక్ష్యాధారాలు చూపకుండా అరెస్ట్ చేసి తెచ్చినందుకు వారికి మొట్టికాయలు వేసి ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు.

మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తరువాత, చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి చిత్తూరులో ప్రెస్‌మీట్‌ పెట్టి, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందని నిరూపించే పక్కా సాక్ష్యాధారాలతోనే ఆయనను అరెస్ట్ చేశామని, నారాయణ స్కూళ్ళలో అడ్మిషన్లు పెంచేందుకే నారాయణ పేపర్ లీక్ చేయించారని చెప్పారు.

ADVERTISEMENT

కానీ ఆ సాక్ష్యాధారాలు చూపాలని న్యాయమూర్తి అడిగినప్పుడు పోలీసులు నీళ్ళు నమిలారు. ఆయనను అరెస్ట్ చేయాలనే అత్యుత్సాహంలో ఏపీ సీఐడీ పోలీసులు మరో విషయం కూడా మరిచారు. ఆయనో టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థలకు అధిపతి అని మాత్రమే గుర్తుంచుకొన్నారు. కానీ ఆయన 2014లోనే ఆ సంస్థల ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలుసుకోలేకపోయారు.

దీంతో ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, నారాయణ సంస్థలతో సంబంధం లేని నారాయణను ఏవిదంగా అరెస్ట్ చేశారని న్యాయమూర్తి సుధారాణి ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. నారాయణ తరపు న్యాయవాది ఆయన 2014లోఏ ఆ సంస్థల ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన పత్రాలను న్యాయమూర్తికి చూపడంతో రెండు లక్షల పూచీకత్తుతో నారాయనకు వెంటనే బెయిల్‌ మంజూరు చేశారు.

ఓ కరడుగట్టిన ఉగ్రవాది తప్పించుకొని పారిపోతుంటే పోలీసులు వెంటాడి పట్టుకొన్నట్లుగా, ఓ విద్యావేత్త అయిన నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు చేజింగ్ చేసి ఐకియా జంక్షన్ వద్ద పట్టుకొన్నారని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?

అదే…ఆయనకు నోటీసులు పంపించి విచారణకు హాజరుకావాలని కోరితే ఆయన వచ్చేవారు కాదా?ఒకవేళ ఆయన విచారణకు హాజరుకాకపోతే అప్పుడు కోర్టుకు తమ వద్ద ఉన్న ప్రాధమిక సాక్ష్యాధారాలు చూపిస్తే న్యాయస్థానమే ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఉండేది కదా?ఈ నిబందనల ప్రకారం పోలీసులు వ్యవహరించి ఉంటే ఎవరూ వారిని ఈవిదంగా వేలెత్తి చూపేవారు కాదు కదా?

పోలీసులు నిన్న ఆయనను అరెస్ట్ చేశారని తెలియగానే ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మొట్ట మొదట అడిగిన ప్రశ్న కూడా ఇదే. ఆయనకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా పోలీసులు ఎలా అరెస్ట్ చేసారని ఆయన ప్రశ్నించారు.

పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని టిడిపి నేతలు గట్టిగా నిలదీస్తుండటంతో, ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న వైసీపీ ప్రభుత్వం టిడిపిని దెబ్బకు దెబ్బ తీయాలని భావించి నారాయణను అరెస్టు చేయించింది. కానీ ఆ అత్యుత్సాహంలో నిబందనలను పట్టించుకోకుండా వ్యవహరించినందుకు న్యాయస్థానంలో మొట్టికాయలు వేయించుకోవలసి వచ్చింది.

ADVERTISEMENT
Latest Stories