నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఘన విజయం సాధించడంతో నందమూరి అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. సినిమాలోని నటీనటులతో పాటు యూనిట్ సభ్యులంతా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న క్రమంలో… ఓ మీడియా ఛానల్ కార్యక్రమంలో లో పాల్గొన్న దర్శకుడు క్రిష్, ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ సీక్రెట్ లను బయటపెట్టారు.
ఈ సినిమాను 50 కోట్ల లోపు బడ్జెట్ తోనే పూర్తి చేశామని, ‘బాహుబలి’కి, ‘శాతకర్ణి’కి చాలా తేడా ఉందని తెలిపారు. ‘బాహుబలి’ అనేది పూర్తిగా ఫాంటసీ చిత్రమని… ‘శాతకర్ణి’ అనేది చరిత్రలో జరిగిన దాన్ని తెరకెక్కించిన ప్రయత్నమని చెప్పారు. తాను ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు… ఆ విషయాన్ని మొదట రాజమౌళితోనే పంచుకున్నానని, ఆయన సలహాలు తీసుకున్నానని తెలిపారు.
ఆ సందర్భంలో గ్రాఫిక్స్ పైన ఎక్కువగా ఆధారపడవద్దని, దాని వల్ల సమయం వృథా కావడమే కాకుండా, పలు సమస్యలు కూడా ఉన్నాయని… ఎంత వీలైతే అంత ఎక్కువగా లైవ్ లోనే షూట్ చేయాలనే సూచనను రాజమౌళి ఇచ్చారని, అతి తక్కువ రోజుల్లోనే సినిమా పూర్తి కావడానికి, అనుకున్న బడ్జెట్ లో సినిమా సిద్ధం కావడానికి రాజమౌళి సలహానే కారణమని అన్నారు.



