గుడివాడ కూడా వేలెత్తి చూపేవారేనా… హవ్వ!

gudivada-amarnath-vijayasai-ysrcp

ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయిన జగన్, గుడివాడ అమర్నాథ్. అంబటి రాంబాబు, రోజా వంటివారు, విజయవాడ వరదల గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు.

జగన్‌ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా నిత్యం టిడిపి, జనసేనలపై రాజకీయ కక్ష సాధింపులతోనే కాలక్షేపం చేసేశారు. సంక్షేమ పధకాలతో ఓటు బ్యాంక్ రాజకీయాలే చేశారు తప్ప తాను స్వయంగా కనిపెట్టిన మూడు రాజధానులు కానీ చివరికి విశాఖని కూడా రాజధాని చేయలేకపోయారు. లక్షల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు.

ADVERTISEMENT

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒక్క పోలవరం గురించి తప్ప రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏనాడూ మాట్లాడలేదు. పోలవరం గురించి కూడా “నాకు దాని గురించి ఏమీ అర్దం కాలేదు. అవగాహన లేదని” మాత్రమే చెప్పుకున్నారు. అటువంటి అంబటి రాంబాబు ఇప్పుడు బుడమేరు, ప్రకాశం బ్యారేజీ గురించి మాట్లాడుతుంటే ఎవరికైనా చాలా విచిత్రంగానే అనిపిస్తుంది.

పర్యాటక, యువజన క్రీడల శాఖ మంత్రి రోజా… మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి విశాఖ రాజధాని కోసం ఆర్‌కే బీచ్ ఒడ్డున సభలో పాల్గొన్నారు కానీ పక్కనే కోతకు గురవుతున్న బీచ్‌వైపు, అక్కడ పేరుకు పోయిన వ్యర్ధాలు, మురుగునీరు వైపు తొంగిచూడనే లేదు.

అసలు ఏపీకి పర్యాటకశాఖ ద్వారానే భారీగా ఆదాయం సమకూర్చవచ్చనే విషయం బహుశః రోజాకి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిసినా జగన్‌ నిధులు విదిలించరు. కనుక రెండున్నరేళ్ళు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ, నెలకు 3-4సార్లు తిరుమల, తాడేపల్లి ప్యాలస్‌ పర్యటనలతోనే కాలక్షేపం చేసేశారు. ఆమె కూడా విజయవాడ వరద బాధితులను ఆడుకోవడంలో సిఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారంటూ విమర్శిస్తున్నారు.

పరిశ్రమలు, ఐ‌టి మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించే ప్రయత్నం చేయలేదు కానీ ఆయన కూడా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను విమర్శిస్తూ మంత్రిగా అదే తన బాధ్యత అనుకున్నారు.

ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచార యావతోనే జేసీబీ, ట్రాక్టర్లలో తిరుగుతున్నారు తప్ప సహాయ చర్యలు చేపట్టడం లేదన్నారు.

ఇలా 5 ఏళ్ళపాటు ఏ పనీ చేయని వైసీపి నేతలందరూ రేయింబవళ్ళు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుని, టిడిపి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం చూస్తే, ప్రజలు వారికి ఎన్నికలలో ఎంత గడ్డి పెట్టినా ఇంకా సరిపోలేదనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories