
వక్ఫ్ బిల్లు పై ఒవైసీ మళ్ళీ రాజకీయం మొదలుపెట్టారు. వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడంతో ఎన్డీయే కూటమిలో భాగమైన టీడీపీ తన భవిష్యత్ నాయకుడైన నారా లోకేష్ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తుంది అంటూ టీడీపీ పై, ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు ఎక్కుపెట్టారు ఒవైసీ.
Also Read – కవిత గెలుపు బిఆర్ఎస్ ఓటమా.?
బాబు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలికి రాజ్యాంగాన్ని అవమానించారని, కర్నూల్ లో వక్ఫ్ భూముల గురించి జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇకనైనా పార్టీ బాధ్యతలు టీడీపీ యువ నాయకుడైన లోకేష్ చేతికి అప్పగించాలంటూ పార్టీ అధినేత బాబు కి ఉచిత సలహాలు ఇస్తున్నారు ఒవైసీ.
అలాగే పనిలోపనిగా జూ.ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తెరమీదకు తెచ్చిన ఒవైసీ ఎన్టీఆర్ కు ఎలాగూ పార్టీ పగ్గాలు అప్పగించారు కదా అంటూ అసందర్భ ప్రకటనలు గుప్పించారు. అయితే ఇక్కడ ఒవైసీ ఎత్తుకున్న టాపిక్ వక్ఫ్ బిల్లు అంశం అయితే దాన్ని కేంద్రంగా చేసుకుని టీడీపీ నాయకత్వ మార్పు అంశాన్ని, జూ. ఎన్టీఆర్ విషయాన్ని తెరమీద కు తేవడం ఒవైసీ కి అవసరం లేని అంశం.
Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!
ఈ వక్ఫ్ చట్ట సవరణ పై బీజేపీ కి టీడీపీ మద్దతు పలకడంతో రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లను టీడీపీ కి దూరం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఒవైసీ ఏపీలో ఈ తరహా రాజకీయ చిచ్చుకు తెరతీశారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం తమ కలల రాజధాని అమరావతి నిర్మాణాల పూర్తి కోసం బీజేపీ కి ఈ తరహా బిల్లులో మద్దతు తెలపడం మంచిది కాదంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ఏపీ అభివృద్ధి కోసం, అమరావతి ప్రగతి కోసం తాము కూడా ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామంటున్నారు ఒవైసీ. అయితే ఇక్కడ ముస్లిం ఓటర్లను తన ప్రసంగాలతో టీడీపీ కి దూరం చేయడంతో పరోక్షంగా వైసీపీ కి లబ్ది చేకూర్చాలన్నది ఒవైసీ రాజకీయ లక్ష్యమా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Also Read – 2029: ఏపీ vs వైసీపీ..?
రోజుకో పార్టీ మద్దతుతో ప్రభుత్వాలతో సానుకూల సంబంధాలు పెట్టుకునే ఎంఐఎం ఇక ఇప్పడు ఏపీలో తన తెరచాటు మిత్రుడైన వైస్ జగన్ కు రాజకీయ లబ్ది చేకూర్చే ప్రయత్నం చేయబోతున్నారా.? ఏపీలో మత రాజకీయాలను రెచ్చకొట్టి కూటమి ప్రభుత్వాన్ని, తద్వారా టీడీపీ పార్టీని దెబ్బకొట్టాలన్నదే ఎంఐఎం లక్ష్యమా.?