ఇది జగన్‌ గేమ్: అర్దమవుతోంది కదా?

Jagan Mohan Reddy Counter Attack on Alliance Government

తల్లిని, చెల్లిని బయటకు గెంటేసి ఆస్తుల కోసం వారిని కోర్టుకి కూడా ఈడ్చిన జగన్‌, రాష్ట్రంలో మహిళల పరిస్థితి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.

ఆయన సతీమణి భారతికి చెందిన సాక్షి మీడియాలోనే ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ మహిళలని కించపరిచారు.

ADVERTISEMENT

ఆమె భర్త జగన్‌కి ఇప్పుడు సాక్షి ఓ ‘మీడియా’ అని హటాత్తుగా గుర్తుకువచ్చినట్లుంది. అందుకే కూటమి ప్రభుత్వం మీడియా గొంతుని అణచివేస్తోందంటూ వాపోతున్నారు.

తన హయంలో టీడీపీలో చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలని ఎంతగా వేధించారో మరిచిపోయినట్లు జగన్‌, సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లని విమర్శిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

తన పాలన నచ్చకనే ప్రజలు 175కి బదులు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి తిరస్కరించారనే విషయం కూడా మరిచినట్లు, చాలా అద్భుతంగా, పారదర్శకంగా, ప్రజా రంజకంగా పాలన సాగిందని జగన్‌ సెల్ఫ్ సర్టిఫై చేసుకోవడం చూస్తే నవ్వొస్తుంది.

సాక్షి ఛానల్లో వారు ఆవిదంగా మాట్లాడటం తప్పే అందుకు క్షమించమని కోరాల్సిన జగన్‌, కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు.

భర్త ఎదురు దాడి చేస్తుంటే తప్పని వారించాల్సిన ఆయన సతీమణి భారతి స్పందించకుండా మౌనంగా ఉండిపోవడం గమనిస్తే, వారిరువురూ జరిగిన తప్పుని తప్పుగా భావించడం లేదని కనుక అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది.

అయినా జగన్‌ దంపతులకు ఇంట్లో తల్లి, చెల్లిపైనే గౌరవం లేనప్పుడు, రాష్ట్రంలో మహిళల పట్ల గౌరవం ఉంటుందని అనుకోవడం దూరాశే కదా?

ఈ తాజా పరిణామాల నుంచి కూడా జగన్‌ రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు జగన్‌ దంపతులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ మహిళలు ధర్నాలు చేయడం వలన ఉపయోగం ఏమిటి? కనుక ప్రభుత్వమే పూనుకొని తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories