దసరా స్పెషల్: ఇంటింటికి జగనన్న మద్యం పథకం!

Jaganannna Dasara Kanuka

రాష్ట్ర ప్రభుత్వాలు పండగ కానుకగా ప్రజలకు ప్రభుత్వం తరుపున ఆయా సందర్భాలకు అనువైన వస్తువులను తాయిలాల రూపంలో ప్రకటించడం చూస్తూ ఉంటాం.అయితే అన్ని పార్టీల మాదిరే ఆలోచిస్తే వైసీపీ పార్టీ ప్రత్యేకత ఏముంది అని భావించారో ఏమో కానీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే అనుచరులు వినూత్న కానుకలతో ప్రజల ముందుకొచ్చారు.

జగనన్న దసరా కానుకల పేరుతో స్థానిక ప్రజలకు ఇంటికో కోడి, ఆ కోడికి తోడు ఒక మద్యం సీసాసును పంపిణి చేసారు బాపు ఆనంద్.మెడలో వైసీపీ కండువా, చేతిలో కోడి, మద్యం సీసాల పంపిణితో కెమెరా కళ్ళకు చిక్కారు సదరు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు.ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.

ADVERTISEMENT

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే అనుమతి లేకుండా అనుచరులు ఇదంతా చేయగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా మాట తప్పని మడం తిప్పని జగన్ రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం ఈ విధంగా అమలు చేస్తున్నారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.రాష్ట్రంలో దసరా కానుకగా జగన్ ప్రభుత్వం “ఇంటింటికి జగనన్న మద్యం పథకం” ప్రవేశపెట్టిందా? అంటూ వైసీపీ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తుంది.

ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండగానే మద్యం సీసాలు పంచిపెడుతున్న అధికార పార్టీ ఇక రానున్న ఎన్నికలలో ఇంకేం పంచుతారో అంటూ నోరెళ్లబెడుతున్నారు స్థానిక ప్రజలు. పరిస్థితి చూస్తుంటే ఇక అధికార పార్టీ నేతల నుండి ప్రజలకు ఇటువంటి తాయిలాలు మరికొన్ని అందడం ఖాయంలానే కనపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories