జైలుకి వెళ్ళేందుకు సిద్దం… తగ్గేదేలే: కల్వకుంట్ల కవిత

kalavakuntla-kavitha-delhi-liquor-Scamతెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుతో బందించేందుకు కేంద్ర ప్రభుత్వం చురుకుగా పావులు కదుపుతోంది. నిన్న ఈడీ కోర్టుకి సమర్పించిన ఓ నివేదికలో కల్వకుంట్ల కవిత పేరును తొలిసారిగా ప్రస్తావిస్తూ ఈ నేరంలో ఆమెకీ భాగం ఉందని పేర్కొంది.

ఈడీ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడంపై కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 8 ఏళ్ళలో 9 ప్రభుత్వాలను కూల్చివేసారు. ఎప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగే ముందు ఆయన కంటే ముందు ఈడీ బృందాలు ఆయా రాష్ట్రాలలో మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తుంటాయి. వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకే ఈడీ, ఐ‌టి, సీబీఐలు తెలంగాణలో మన మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నాయి తప్ప మేము ఎటువంటి నేరమూ చేయలేదు.

ADVERTISEMENT

ఈ కేసుల గురించి మీడియాకి లీకులు ఇచ్చి, మాపైకి ఈడీ, ఐ‌టి, సీబీఐలను ఉసిగొల్పి భయపెట్టి లొంగదీయాలనుకోవడం చాలా నీచమైన ఆలోచన. రాజకీయంగా చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎత్తులు పనిచేయవని ప్రధాని మోడీ గ్రహిస్తే మంచిది. మా మీద ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాము. దర్యాప్తు సంస్థలు మాకు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తే సమాధానాలు చెపుతాము. మమ్మల్ని జైళ్ళలో వేస్తామంటే వేసుకోవచ్చు. ప్రజలు మా వెంట ఉన్నంతకాలం మేము ఎవరికీ భయపడబోము,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.

ADVERTISEMENT
Latest Stories