కేసీఆర్ హయంలో తెలంగాణ రాష్ట్రం నభూతో నభవిష్యతి అన్నట్లు అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆ అభివృద్ధి మాటున బీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు చాలానే ఉన్నాయని కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో ఒకటొకటిగా బయట పడుతున్నాయి.
గత నెలలో ఆమె జిల్లా పర్యటనలు మొదలుపెట్టినప్పుడు, ఓ గ్రామంలో పర్యటించినప్పుడు గ్రామస్తులు తమ బాధలు ఆమెతో మొరపెట్టుకున్నారు.
రెండు కిలోమీటర్ల పొడవు రోడ్ నిర్మిస్తే మీ ప్రాంతం అభివృద్ధి అవుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు నమ్మబలికి తమ భూములు గుంజుకున్నారని చెప్పుకొని వారు బాధ పడ్డారు. తాము నిరుపేద రైతులమని కేసీఆర్ పాలనలో తమకు ఇంత అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామానికి చుట్టుపక్కల కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, నవీన్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరికీ 20-30 ఎకరాల భూములున్నాయని గ్రామస్తులు చెప్పారు. వాటిలో కొందరు ఫామ్‌హౌసులు కట్టుకున్నారని గ్రామస్తులు కల్వకుంట్ల కవితకి చెప్పారు. వారి భూములు, ఫామ్‌హౌసులకి నష్టం కలగకుండా తమ భూముల మీదుగా రోడ్డుని వంకలు తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు ఇంత ఆవేదన, కడుపు మంటతో బీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు వారి వలన తమకు జరిగిన అన్యాయం గురించి చెపుతుంటే, కల్వకుంట్ల కవిత చిర్నవ్వులు నవ్వుతూ విన్నారు. అంటే ఆమె బీఆర్ఎస్ నుంచి బయటపడ్డారు కనుక ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలను వింటూ నవ్వుతున్నారని అర్ధమవుతూనే ఉంది.
కానీ ఇవన్నీ ఆమె తండ్రి కేసీఆర్ పాలనలోనే జరిగాయి. ఆమె కూడా పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి కదా? చాలా రాజకీయ అనుభవం, లోకజ్ఞానం ఉన్న ఆమెకు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఈ అవినీతి, అక్రమాలు తెలుసుకోలేదా?
హరీష్ రావు , కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నవీన్ రావు భూములే ఇక్కడ ఉన్నాయి – RRR రింగ్ రోడ్ భూ నిర్వాసిత రైతులు pic.twitter.com/g46Ul6HiHT
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) November 17, 2025




