ఒక్క సీటు తగ్గినా కాంగ్రెస్‌కి ఖాళీ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

vMP Komatiretty Venkata Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టయిలే వేరు. ఆయన పార్టీలో చాలా సీనియర్ కనుక అధ్యక్ష పదవి, పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తనకే దక్కాలని కోరుకొంటూ ఉంటారు. కానీ అందుకు తగ్గట్లుగా పార్టీకి అండగా నిలబడుతూ బలోపేతం చేసుకొనేందుకు ఎన్నడూ ప్రయత్నించరు. పైగా పార్టీకి నష్టం కలిగే విదంగానే వ్యవహరిస్తుంటారు. మాట్లాడుతుంటారు.

ADVERTISEMENT

ఎన్నికలు దగ్గరపడుతుంటే పార్టీలో ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేస్తుంటే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి, కాంగ్రెస్‌ గెలుపోటముల గురించి మాట్లాడుతున్నారు.

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలనుకొంటే కుదరదు. అవుతారని ఎవరు సర్టిఫై చేసినా చెల్లదనివెంకట్ రెడ్డి అన్నారు. తాజాగా టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 59 కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభ్యర్ధుల ఎన్నికల ఖర్చుని కేసీఆరే భరిస్తున్నారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ తరపున గెలిచిన వారందరూ కేసీఆర్‌ చిటిక వేయగానే బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారని బీజేపీ వాదిస్తోంది. దాని వాదనలను ధృవీకరిస్తున్నట్లు వెంకట్ రెడ్డి మాట్లాడారు.

అయితే ఇదే వాస్తవం కూడా. గత రెండు ఎన్నికలలో కాంగ్రెస్‌, టిడిపి టికెట్స్ మీద గెలిచిన వారందరూ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఈసారి కూడా అదే జరుగవచ్చు. అయితే వెంకట్ రెడ్డి వంటి సీనియర్ ఎన్నికలకు ముందు ఈవిదంగా మాట్లాడటమే చాలా తప్పు.

ఆయన చెప్పిన్నట్లుగా కాంగ్రెస్‌కు 59 సీట్లు వచ్చినా సరిపోదు. కనీసం 70-80 సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీ సాధించవలసి ఉంటుంది. లేకుంటే బిఆర్ఎస్ పార్టీకి బొటాబోటి సీట్లు వచ్చిన్నట్లయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయమే. కానీ అంతకంటే ముందు ఈయన నోటికి తాళం వేయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories