
ఏపీలో వైసీపీ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జగన్ అరాచక పాలన సాగిస్తున్నప్పుడు, అక్కడ తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి చేసుకునేవారు. కానీ ఇద్దరూ ఎన్నికలలో ఘోర పరాజయం పొందారు. ఇనుముని తుప్పు తినేసి బలహీన పరిచినట్లు, వారి అహంభావమే వారి పార్టీలని తినేసిందని చెప్పవచ్చు.
కానీ నేటికీ ఇక్కడ జగన్ వైసీపీ నేతల ధోరణిలో కానీ, అక్కడ కేటీఆర్ ధోరణిలో గానీ ఎటువంటి మార్పు రాలేదని రోజూ వారు మాట్లాడుతున్న మాటలే పట్టిస్తున్నాయి.
Also Read – కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట కేసీఆర్ ఇవాళ్ళ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ స్పందిస్తూ, “రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడికి వంద జన్మలు ఎత్తినా కేసీఆర్ గొప్పతనం అర్దం కాదు. అయినా రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవపడి ఇక్కడి నుండి తరిమిన ఘనుడు కేసీఆర్. కనుక ఈ చిల్లరగాడు కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు,” అని కేటీఆర్ అన్నారు.
తన తండ్రి గొప్పదనం గురించి చెప్పుకొంటున్న కేసీఆర్, ఆయనని ఆ చిల్లరగాడే ఎన్నికలలో ఓడించి ఫామ్‌హౌస్‌లో పడుకోబెట్టాడనే విషయం మరిచిపోయినట్లున్నారు. నేటికీ తండ్రి పేరు చెప్పుకొనిదే మనుగడ సాగించలేని కేటీఆర్, చంద్రబాబు నాయుడుని తన తండ్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి తరిమికొట్టారని చెప్పుకోవడం అహంకారానికి పరాకాష్ట.
Also Read – సైకో రాజకీయాలు చేయవద్దని చెప్పా: పేర్ని నాని
అయితే తన తండ్రిని ఫామ్‌హౌస్‌లో పడుకోబెట్టడంలో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి అందరికీ తెలిసిందే. కనుక రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి చేతిలో ఎదురు దెబ్బలు తిన్నామనే విషయం కూడా కేటీఆర్ గుర్తుంచుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఇంత చులకనగా మాట్లాడే వారు కారు.
బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు చెప్పట్టాలని కేటీఆర్ తహతహలాడుతున్నారు. కానీ నేటికీ ఈవిదంగా అహంభావంతో మాట్లాడుతున్నారు కనుక బిఆర్ఎస్ పార్టీ పతనానికి కేటీఆర్ స్వయంగా బాటలు వేసుకుంటున్నారు.