యువగళం పాదయాత్ర తొలిరోజే… తొలికేసు

Nara_Lokesh_Yuva_Galam_Padayatra_Day_1ఊహించిన్నట్లే టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకి అవరోధాలు మొదలయ్యాయి. తొలిరోజునే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడిపై కుప్పం ఎస్సై శివకుమార్ ఫిర్యాదు మేరకు కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. సెక్షన్ 153 కింద ఎఫ్ఐఆర్ నంబర్: 25/2023 నమోదు చేసిన్నట్లు సీఐ శ్రీధర్ మీడియాకి తెలియజేశారు. బహిరంగసభలో అచ్చన్నాయుడు పోలీసులని కించపరుస్తూ వారి మనో ధైర్యాన్ని దెబ్బతీసేవిదంగా, ప్రజలని రెచ్చగొట్టేవిదంగా మాట్లాడారని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శ్రీధర్ తెలియజేశారు.

నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో తీవ్ర ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలు, వారి మీడియా అప్పుడే ఎదురుదాడి ప్రారంభించేశారు. తారకరత్నకి గుండెపోటు వచ్చినందుకు అందరూ ఆందోళన చెందుతుంటే నారా లోకేష్‌ తొలి అడుగు వేయగానే నందమూరి కుటుంభానికి చెందిన తారకరత్నకి ప్రాణాపాయం కలిగిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

ADVERTISEMENT

తారకరత్నకి గుండెపోటు వచ్చి కుప్పం హాస్పిటల్‌లో చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతుంటే నారా లోకేష్‌ అదేమీ పట్టన్నట్లు పాదయాత్ర చేసుకొన్నారని వైసీపీ మీడియా వ్రాసేసింది. నిన్న కుప్పం బహిరంగసభకి వేలాదిగా కార్యకర్తలు, జనం తరలివస్తే జనాలు లేక సభ వెలవెలపోయిందని, నారా లోకేష్‌ పాదయాత్రకి ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదని వ్రాసి వైసీపీ నేతలకి మనశాంతి కలిగించింది.

నిజానికి వేలాదిగా కార్యకర్తలు తరలిరావడం వలననే కుప్పంలో మసీదు వద్ద తారకరత్న ఉక్కిరిబిక్కిరి అయ్యి స్పృహతప్పి పడిపోయిన సంగతి అదే మీడియా నిన్న వ్రాసింది. కానీ ఈరోజు జనాలు లేక వెలవెలపోయిందని వ్రాయడం విశేషం.

నారా లోకేష్‌ పాదయాత్రకి భారీగా జనం, కార్యకర్తలు తరలివచ్చినందున అర్దాంతరంగా రద్దు చేసుకొని వెళితే వారందరూ బాధపడతారని, అదీగాక పాదయాత్ర తొలిరోజే అర్దాంతరంగా రద్దు చేసుకొంటే అశుభమని భావించి నారా లోకేష్‌ తొలి రోజు పాదయాత్రని పూర్తి చేసి వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. రాత్రి చాలాసేపు వరకు బాలయ్యతో పాటు అక్కడే ఉన్నారు. తారకరత్నని బెంగళూరు తరలించాలని నిర్ణయించిన తర్వాత రాత్రి సుమారు 10 గంటలకి నారా లోకేష్‌ అక్కడి నుంచి వెళ్ళారు.

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి నిన్న రాత్రి 9.30 గంటలకి కుప్పం చేరుకొన్న తర్వాత ఆమెకి పరిస్థితి వివరించి ఆమె అనుమతితో అర్దరాత్రి 11.30-12.00 గంటలకి రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కనుక తారకరత్నని బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కి అంబులెన్సులో తరలిస్తే అదీ నాటకీయమేనట!

ADVERTISEMENT
Latest Stories